ఐపీఎల్ (Ipl 2022) కొత్త జట్ల కోసం అక్టోబర్ 17న ఈ-బిడ్డింగ్ (Ipl new team 2022 auction) నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. అక్టోబర్ 5వరకు బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఆగస్టు 31న బిడ్లకు ఆహ్వానం పలికింది బీసీసీఐ.
"2022 సీజన్ నుంచి కొత్తగా ప్రతిపాదించిన రెండు జట్లలోని ఒకదానిని సొంతం చేసుకొని, నిర్వహించుకునేందుకు ఐపీఎల్ పాలకమండలి బిడ్లను ఆహ్వానిస్తోంది." అని గతంలో బీసీసీఐ ఓ ప్రకటన విడుదలచేసింది.
కొత్త ఫ్రాంచైజీల రేసు(Ipl 2022 new teams)లో అహ్మదాబాద్, లఖ్‌నవూ, పుణె ముందు వరుసలో ఉన్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం, లఖ్‌నవూలోని ఏకనా స్టేడియాలు భారీ సామర్థ్యంతో కూడుకున్నవి. దీంతో ఈ రెండు పట్టణాల పేర్లు కొత్త ఫ్రాంచైజీలకు అనువుగా ఉన్నాయి.
ఇక కంపెనీల విషయానికొస్తే అదానీ, ఆర్పీజీ సంజీవ్ గోయంక గ్రూప్, టొరెంట్ ఫార్మాతో పాటు మరికొన్ని సంస్థలు బిడ్ దాఖలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలుస్తోంది.
ఇదీ చూడండి:IPL 2022: కొత్త జట్ల కనీస ధర పెంపు.. బోర్డుకు కాసుల వర్షమే!