తెలంగాణ

telangana

ETV Bharat / sports

దుమ్మురేపిన పుజారా.. దులీప్​ ట్రోఫీలో 'సూపర్'​ సెంచరీ.. - దులీప్ ట్రోఫీ పుజారా ఇన్నింగ్స్

Duleep Trophy Semi Final 2023 : ఛెతేశ్వర్ పుజారా శతకంతో కదం తొక్కాడు. దులీప్ ట్రోఫీ - 2023లో వెస్ట్​ జోన్ తరఫున ఆడుతున్న అతడు.. ఫస్ట్​ క్లాస్​ కెరీర్​లో 60వ సెంచరీని నమోదు చేశాడు.

Duleep Trophy Semi Final 2023
సెంచరీ బాదిన పుజారా

By

Published : Jul 7, 2023, 3:52 PM IST

Updated : Jul 7, 2023, 3:59 PM IST

Duleep Trophy Semi Final 2023 : టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్ట్ ఛెతేశ్వర్ పుజారా సెంచరీ బాది తన ఫామ్​ను చాటుకున్నాడు. దులీప్ ట్రోఫీ 2023లో సెంట్రల్​ జోన్​తో జరుగుతున్న మ్యాచ్​ రెండో ఇన్నింగ్స్​లో పుజారా.. వంద పరుగుల మార్క్​ను దాటాడు. పుజారా తన క్లాస్ ఆటతీరుతో ఫస్ట్​ క్లాస్ కెరీర్​లో 60వ సెంచరీని నమోదు చేశాడు. మూడో రోజు కొనసాగుతున్న ఆటలో పుజారా ప్రస్తుతం.. 132 పరుగులతో (14 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నాడు.

Duleep Trophy West Zone vs Central Zone : దులీప్‌ ట్రోఫీ-2023 మొదటి సెమీఫైనల్స్​లో వెస్ట్​ జోన్, సెంట్రల్​ జోన్​ల మధ్య మ్యాచ్​ జరుగుతోంది. వెస్ట్​ జోన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా రెండో రోజు ఓవర్​నైట్​ స్కోరు (50)తో.. మూడో రోజు ఆట ప్రారంభించాడు. సూర్యకుమార్ యాదవ్ (52) తప్ప.. మరోవైపు తనకు సహకారం అందించే వారు కరువయ్యారు. అయినప్పటికీ పుజారా ఎంతో ఓర్పుతో క్రీజులో నిలదొక్కుకున్నాడు. అద్భుత ప్రదర్శనతో 380 పై చిలుకు ఆధిక్యంతో జట్టును ముందంజలో ఉంచాడు.

కాగా మూడో రోజు లంచ్​ తర్వాత ఆట సాగుతుండగా.. వర్షం ఆటంకం కలిగించింది. దీంతో మ్యాచ్ నిలిచిపోయింది. ప్రస్తుతం వెస్ట్ జోన్ 291/8 తో ఉంది. అయితే విండీస్ పర్యటనకు టీమ్ఇండియా టెస్టు జట్టులో పుజారాకు టీమ్ఇండియా సెలెక్టర్లు మొండి చేయి చూపారు.

అంతకుముందు మొదటి ఇన్నింగ్స్​లో​ వెస్ట్ జోన్ 220 పరుగులకే కుప్పకూలింది. సెంట్రల్ జోన్ బౌలర్​ శివమ్‌ మావి (6/43) నిప్పులు చెరిగాడు. తర్వాత బ్యాటింగ్​కు దిగిన.. సెంట్రల్ జోన్​లో ధృవ్ జోరెల్ (46 పరుగులు), రింకూ సింగ్ (48 పరుగులు) మినహా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫలితంగా సెంట్రల్​ జోన్ జట్టు 128 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వెస్ట్ జోన్ బౌలర్లలో నాగస్వల్లా 5 వికెట్లు నేల కూల్చాడు.

Duleep Trophy North Zone vs South Zone : మరోవైపు నార్త్ జోన్, సౌత్​ జోన్​ల మధ్య రెండో సెమీస్​ జరుగుతోంది. మొదటగా బ్యాటింగ్ చేసిన నార్త్​​ జోన్ 198 పరుగులకు కుప్పకూలింది. తర్వాత సౌత్​ జోన్ కూడా 195 పరుగుల స్వల్ప మొత్తానికే ఆలౌటైంది. తర్వాక రెండో ఇన్నింగ్స్​లోనూ పెద్దగా ప్రభావం చూపని.. నార్త్​​ జోన్ 211 పరుగులు చేసి.. సౌత్​ జోన్ ముందు 208 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కాగా రెండు సెమీస్​లోని విజేతల మధ్య జులై 12 నుంచి ఫైనల్​ ప్రారంభం కానుంది.

Last Updated : Jul 7, 2023, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details