Dube On Dhoni:ఆదివారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చింది. ముందుగా బౌలింగ్‌లో ఆకట్టుకున్న భారత్ ఆపై ఛేజింగ్‌లో అద్భుతంగా ఆడి 6 వికెట్ల తేడాతో మ్యాచ్ నెగ్గింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్ (68), శివమ్ దూబే (63*) బ్యాటింగ్ తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఈ ఇద్దరూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి ఎడాపెడా బౌండరీలు బాదారు. దీంతో ఈ మ్యాచ్‌కు యశస్వి, దూబే హైలైట్‌గా నిలిచారు. ఇక మ్యాచ్ అనంతరం తన క్రెడిట్ ధోనికే దక్కుతుందని దూబే అనగా, రోహిత్, విరాట్ తనకెంతో మద్దతుగా నిలిచారని యశస్వి గుర్తుచేసుకున్నాడు.
'ఈ క్రెడిట్ మహీ భాయ్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దక్కుతుంది. నాలోని గేమ్‌ను బయటకు తీసుకొచ్చి, నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది మహీ భాయ్. ఐపీఎల్లో చెన్నై నాపై ఎంతో నమ్మకముంచింది. మేనేజ్మెంట్ నన్ను ఎప్పుడు ప్రోత్సాహిస్తూ నేను అద్భుతంగా ఆడగలనని నమ్మింది' అని దూబే అన్నాడు.
'రోహిత్ భయ్యా, విరాట్ భయ్యా నా ఇన్స్ప్రెషన్. టెన్షన్ పడకుండా ఆడుకోమని రోహిత్ భయ్యా బ్యాటింగ్‌కు ముందు చెప్పాడు. జట్టులో తన లాంటి సీనియర్ ఉండడం మంచిది. విరాట్ భయ్యతో కలసి ఆడడం ఎప్పుడు గొప్ప అనుభూతి ఇస్తుంది. అతడితో ఆడడం అదృష్టంగా భావిస్తా. ఈ పిచ్‌పై ఎలాంటి షాట్స్ ఆడాలో భయ్యాతో డిస్కస్ చేశా' అని యశస్వి అన్నాడు.