అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) నిర్ణయ సమీక్ష విధానంను(DRS Rules in T20) ప్రవేశపెట్టనున్నారు. టీ20ల్లో డీఆర్ఎస్ అమలుకు(DRS rules) అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC News) ఆమోదం తెలిపింది. ప్రతి జట్టుకు ఒక ఇన్నింగ్స్‌లో గరిష్టంగా రెండు రివ్యూలు అందుబాటులో ఉంటాయి. గతంలో వన్డేల్లో ప్రతి జట్టుకు ఒక ఇన్నింగ్స్‌లో ఒక డీఆర్ఎస్, టెస్టుల్లో 2 డీఆర్ఎస్లు అమలులో ఉండేవి.
ICC News: టీ20 ప్రపంచకప్‌లో ఇదే తొలిసారి - DRS rules
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో(ICC T20 World Cup 2021) నిర్ణయ సమీక్ష విధానాన్ని ప్రవేశపెట్టనుంది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC News). ఒక ఇన్నింగ్స్‌లో ప్రతి జట్టుకు గరిష్టంగా రెండు రివ్యూలు తీసుకునే వీలును కల్పిస్తుంది.
టీ 20 ప్రపంచకప్ 2021
అయితే కొవిడ్ కారణంగా అనుభవజ్ఞులైన అంపైర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఆసంఖ్యను వన్డేల్లో ప్రతి జట్టుకు ఒక ఇన్నింగ్స్‌లో రెండు డీఆర్ఎస్లు, టెస్టుల్లో 3 రివ్యూలకు ఐసీసీ పెంచింది. దుబాయ్, ఒమన్‌వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 17న ప్రారంభమై నవంబర్ 14న ముగియనుంది.
ఇదీ చదవండి:T20 World Cup 2021: టీమ్ఇండియాలో ఉమ్రాన్‌కు చోటు!