DRS Controversy: సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత్ ఎక్కువగా డీఆర్ఎస్ గురించే ఆలోచిస్తూ.. మ్యాచ్ గురించి మర్చిపోయిందని దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ అన్నాడు. అది మేం మరింత స్వేచ్చగా ఆడేందుకు సహయపడిందని పేర్కొన్నాడు.
"మూడో టెస్టులో టీమ్‌ఇండియా కొంచెం ఒత్తిడికి గురైంది. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో వెంటనే వికెట్లు దక్కకపోవడం అందుకు ప్రధాన కారణం. అదే సమయంలో రివ్యూలో నేను నాటౌట్ అని తేలడంతో భారత ఆటగాళ్లు మరింత అసహనానికి గురయ్యారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఆవేశంగా కనిపించాడు. డీఆర్‌ఎస్ గురించి ఆలోచిస్తూ ఆటపై సరిగా దృష్టి పెట్టలేకపోయారు. ఆ అవకాశాన్ని మేం సద్వినియోగం చేసుకున్నాం. నిలకడగా రాణిస్తూ విజయ తీరాలకు చేరుకోగలిగాం. భారత్ లాంటి బలమైన జట్టుపై విజయం సాధించినందుకు చాలా గర్వంగా ఉంది"
-- డీన్ ఎల్గర్, దక్షిణాఫ్రికా కెప్టెన్.