తెలంగాణ

telangana

ETV Bharat / sports

Dravid vs Kohli: కోహ్లీకి కోచ్​ ద్రవిడ్ బ్యాటింగ్ పాఠాలు - dravid kohli updates

Dravid vs Kohli: ఈ నెల 26న దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​లో తలపడేందుకు సిద్ధమవుతోంది టీమ్ఇండియా. ఇప్పటికే ఆ దేశంలో ఉన్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్​ మొదలుపెట్టారు. ఈ క్రమంలో కోచ్​ ద్రవిడ్.. కెప్టెన్​ కోహ్లీకి బ్యాటింగ్​లో సూచనలిస్తూ కనిపించాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్​లో పోస్ట్ చేసింది.

South Africa vs India
కోహ్లీ

By

Published : Dec 19, 2021, 4:43 PM IST

Dravid vs Kohli: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఆ దేశానికి చేరుకున్న భారత క్రికెటర్లు వెంటనే సాధన ఆరంభించేశారు. ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ సోహమ్‌ దేశాయ్‌ల ఆధ్వర్యంలో ఆటగాళ్ల సాధన సాగింది. అయితే.. ఈ సందర్భంగా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి బ్యాటింగ్​లో సూచనలిచ్చాడు కోచ్​ ద్రవిడ్​. ఆ వీడియోను బీసీసీఐ ట్విట్టర్​లో పోస్ట్ చేసింది. మిగిలిన ఆటగాళ్లు ఫుట్‌బాల్‌ ఆడుతూ, రన్నింగ్‌ చేస్తూ వీడియోలో కనిపించారు.

South Africa vs India News:

ఇప్పటిదాకా టీమ్‌ఇండియా టెస్టు సిరీస్‌ గెలవని ఏకైక దేశం దక్షిణాఫ్రికా. 2011లో సిరీస్‌ను డ్రా చేసుకోవడాన్ని మినహాయిస్తే.. ప్రతి పర్యటనలోనూ ఓటములే ఎదుర్కొంది భారత్‌. అయితే ఈ నెల 26న ఆ దేశంలో మొదలయ్యే మూడు టెస్టుల సిరీస్‌లో మాత్రం కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ప్రాక్టీస్​ చేస్తోంది టీమ్​. ప్రస్తుత దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ విభాగం బలహీనంగా కనిపిస్తున్న నేపథ్యంలో భారత్‌ సిరీస్‌ గెలవడానికి మంచి అవకాశాలే ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి:IND vs SA Test: కేఎల్ రాహుల్​కు బంపర్ ఆఫర్​.. రోహిత్ స్థానంలో

ABOUT THE AUTHOR

...view details