తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20ల్లో కోహ్లీ స్థానంపై ద్రవిడ్ క్లారిటీ.. అసలు విషయం చెప్పేశాడుగా! - రాహుల్​ ద్రవిడ్​ కామెంట్స్​

గత కొద్ది కాలంగా టీ20ల్లో టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ కోహ్లీ స్థానంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ విషయమై స్పందించాడు ప్రధాన కోచ్​ రాహుల్ ద్రవిడ్​. ఏం చెప్పాడంటే?

rahul dravid
rahul dravid

By

Published : Jan 24, 2023, 12:22 PM IST

గతేడాది జరిగిన ఆసియా కప్​ నుంచి అద్భుతమైన ఫామ్​లో ఉన్న టీమ్ఇండియా మాజీ కెప్టెన్​​ విరాట్ కోహ్లీ.. వరుసగా సెంచరీలు బాదుతూ తన శతక దాహాన్ని తీర్చుకుంటున్నాడు. అయితే ఈ స్టార్​ ప్లేయర్​ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు మినహా.. శ్రీలంకపై జరిగిన మ్యాచ్​ల్లోనూ రెండు శతకాలు సాధించాడు. ఇక ప్రస్తుతం జరగనున్న మూడో మ్యాచ్​లో కివీస్‌పైనా రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో బీసీసీఐ.. యువకులకు పెద్దపీట వేస్తుందనే ఊహాగానాలు ప్రస్తుతం జోరందుకున్నాయి. దీంతో టీ20ల్లోనూ మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ పరిస్థితిపై ఫ్యాన్స్​లో ఆందోళన నెలకొంది.

ఈ క్రమంలోనే తాజాగా ఈ విషయమై స్పందించాడు టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌. గత ప్రపంచకప్‌ తర్వాత నుంచి ఒక్క టీ20 సిరీస్‌లోనూ కోహ్లీ ఆడలేదని, అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారిందని ఓ విలేకరి అడగ్గా.. రాహుల్‌ మధ్యలో కలగజేసుకొని సమాధానం ఇచ్చాడు. "అదేం కాదు. అసలు అతడిని తప్పించాలనే ఉద్దేశం అస్సల్లేదు. మా వల్ల కాదు" అని స్పందించాడు.

"నిర్దిష్ట సమయాల్లో కొన్ని సిరీస్‌లకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చే నెలలో బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌కు అర్హత సాధించాల్సిన అవసరం ఉంది. అలాగే వన్డే ప్రపంచకప్‌ ఉంది. గత ప్రపంచకప్‌ తర్వాత ఇవే ప్రాధాన్యత కలిగిన గేమ్‌లుగా మేం భావించాం. మరొక విషయం ఏంటంటే వన్డేలన్నింటినీ ఆడాడు. అయితే వచ్చే వారం టీ20 మ్యాచ్‌లకు మాత్రం రోహిత్‌తోపాటు కోహ్లీ మరో ఇద్దరు సీనియర్లు విశ్రాంతి తీసుకొంటారు. ఆస్ట్రేలియా ఇక్కడ పర్యటించే సమయానికి ఆటగాళ్లను తాజాగా ఉంచాలనేదే మా అభిమతం. ఇదే మా ప్రాధాన్యత" అని రాహుల్‌ వెల్లడించాడు.

ABOUT THE AUTHOR

...view details