క్రికైట్ మైదానంలో బ్యాటింగ్‌తో గత పదేళ్లుగా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్, టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఉర్రూతలూగించారు. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఆడిన వీరిద్దరూ కలిసి ట్రోఫీని సాధించలేకపోయినా.. తమ ఆటతీరుతో ప్రేక్షకుల మదిని గెలుచుకున్నారు.
ఐపీఎల్లో 2008లో ఆర్సీబీ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఆ జట్టులోనే ఉన్న కోహ్లీ.. 2011 నుంచి ఏబీ డివిలియర్స్ రాకతో(Rcb ab de villiers), అతనితో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకుంటూ వచ్చాడు. మైదానంలోనే కాకుండా వీరిద్దరి స్నేహం(Kohli ab friendship).. బయట కూడా అలానే అల్లుకుపోయింది. ఇటీవల అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నానని ఏబీ డివిలియర్స్ సంచలన ప్రకటన(Ab de villiers retirement) చేశాడు. ఈ క్రమంలో.. 'మన బంధం ఆటను మించింది. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది' అని కోహ్లీ చేసిన భావోద్వేగ ట్వీట్.. ఏబీతో అతడి సాన్నిహిత్యానికి ప్రత్యేక సాక్ష్యం. అయితే.. అంతటి స్నేహితులైన కోహ్లీ, డివిలియర్స్ మొదటిసారి ఎలా కలిశారు? కోహ్లీని చూసి ఏబీ ఏం అనుకున్నాడు? ఈ విషయాలను గతేడాది జరిగిన ఇన్‌స్టా లైవ్‌లో కోహ్లీ సమక్షంలోనే డివిలియర్స్ షేర్(Ab de villiers about virat kohli) చేసుకున్నాడు. ఆ విషయాలు ఇప్పుడు మరోసారి మీకోసం.
"అదో ఆసక్తికరమైన కథ. కొన్నేళ్ల నుంచి ఓ వ్యక్తి గురించి వింటూ ఉంటే.. చాలా ఆత్రుతగా ఉంటుంది. మార్క్ బౌచర్ ద్వారా నీ గురించి నేను చాలా విన్నాను. ఆర్సీబీ తరపున నువ్వు ఆడటం ప్రారంభించినప్పుడు నీ వయసు 18-19 ఏళ్లు ఉంటాయని అనుకుంటాను. అప్పటి నుంచి నాకు నువ్వు తెలుసు. కానీ, నిన్ను నేను ఎప్పుడూ కలవలేదు. బౌచర్ నీ గురించి చెబుతూ ఉండేవాడు. జోహన్నెస్‌బర్గ్‌లో నెట్స్ నుంచి వస్తుంటే 'హాయ్' అని నీతో అన్నాను. కానీ, అప్పుడు నేను నిన్ను పూర్తిగా నమ్మలేదు"