తెలంగాణ

telangana

By

Published : Jul 3, 2021, 5:51 PM IST

ETV Bharat / sports

Cricket News: దేశవాళీ క్రికెట్ మ్యాచ్​లు అప్పటినుంచే..

కొవిడ్​తో వెలవెలబోయిన క్రికెట్ మైదానాలు త్వరలోనే దేశవాళీ​ టోర్నీలతో కోలాహాలంగా మారనున్నాయి. ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీ సహా 2021-22 సీజన్​లో 2127 మ్యాచ్​లకు బీసీసీఐ షెడ్యూల్ విడుదల చేసింది.

Domestic Season
Ranji Trophy

భారత్​లో దేశవాళీ క్రికెట్ సందడికి రంగం సిద్ధమైంది. కొవిడ్​ కారణంగా గత సీజన్​లో ఎలాంటి టోర్నీలు నిర్వహించలేకపోయిన బీసీసీఐ.. త్వరలోనే అన్ని వయసుల వారికి మ్యాచ్​లు జరపనుంది. నవంబరు 16 నుంచి ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీ సహా 2021-22 సీజన్​లో మొత్తం 2127 మ్యాచ్​లను నిర్వహించనుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటన విడుదల చేశారు.

అక్టోబరు 20న ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీతో ఈ ఏడాది పూర్తి స్థాయి దేశవాళీ సీజన్​ ప్రారంభంకానుంది.

ఇవీ దేశవాళీ పూర్తి షెడ్యూల్ వివరాలు..

  • 2021 సెప్టెంబరు 21 నుంచి సీనియర్ మహిళల వన్డే లీగ్ ప్రారంభం
  • 2021 అక్టోబరు 27 నుంచి సీనియర్ మహిళల వన్డే ఛాలెంజర్ ట్రోఫీ
  • 2021 నవంబరు 12న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ఫైనల్
  • 2021 నవంబరు 16 నుంచి 2022 ఫిబ్రవరి 19 వరకు రంజీ ట్రోఫీ
  • 2022 మార్చి 26న విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్

దేశవాళీ సీజన్​ను క్రికెటర్లు సహా అందరి ఆరోగ్య భద్రతలకు భరోసా ఇస్తూ నిర్వహిస్తామని బీసీసీఐ విశ్వాసం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి:India vs Srilanka: ప్రాక్టీస్​ మొదలుపెట్టిన గబ్బర్​సేన

ABOUT THE AUTHOR

...view details