తెలంగాణ

telangana

ETV Bharat / sports

మాట నిలబెట్టుకున్న బీసీసీఐ.. ఆ క్రికెటర్ల ఖాతాలో డబ్బులు! - దేశవాళీ క్రికెటర్లు బకాయి చెల్లింపులు

Domestic cricketers match fees: కరోనా వల్ల మ్యాచ్​లు జరగక ఆర్థికంగా ఇబ్బంది పడిన దేశవాళీ క్రికెటర్లకు పరిహారం చెల్లించడం ప్రారంభించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు.

bcci
బీసీసీఐ

By

Published : Jan 3, 2022, 9:37 AM IST

Domestic cricketers match fees: కరోనా వల్ల మ్యాచ్​లు జరగక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్న దేశవాళీ క్రికెటర్లకు శుభవార్త. వారికి చెల్లించాల్సిన పరిహారాన్ని ఇవ్వడం ప్రారంభించింది బీసీసీఐ. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

"గత సీజన్​ ఎర్ర బంతి టోర్నీ​ జరగని నేపథ్యంలో ఆటగాళ్లకు పరిహారాన్ని ఇవ్వడం ప్రారంభించింది బీసీసీఐ. ఇప్పటికే చాలామంది ప్లేయర్లకు డబ్బులు అందాయి. మిగతా వారికి కూడా అందించి మరికొన్ని వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తాం"

-బీసీసీఐ అధికారి.

గత సీజన్​లో కరోనా వల్ల దేశవాళీ క్రికెట్​ చరిత్రలో తొలిసారి రంజీ ట్రోఫీని నిర్వహించలేదు. మహిళల టీ20 టోర్నీ కూడా జరగలేదు. దీంతో చాలామంది క్రికెటర్లు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2019-20 సీజన్​లో పాల్గొన్న ఆటగాళ్లకు 2020-21కు సంబంధించిన మ్యాచ్​ ఫీజులో 50 శాతం.. కాంపెన్​సేషన్​గా(పరిహారం)​ ఇస్తామని గతేడాది సెప్టెంబరులో ప్రకటించింది బీసీసీఐ. ఇప్పుడు దానినే ఆటగాళ్లకు చెల్లించడం ప్రారంభించింది బోర్డు.

గతేడాది సెప్టెంబరులో జరిగిన అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​లో సీనియర్​ ఆటగాళ్ల జీతాలను పెంచాలని బోర్డు నిర్ణయించింది. దీంతో ఒక రోజుకు పురుషులు రూ.40-60వేలు, మహిళలు రూ.20 వేలు అందుకుంటారు.

ఇదీ చూడండి: 'బుమ్రా వైస్​కెప్టెన్​ అవ్వడం ఆశ్చర్యమేసింది'

ABOUT THE AUTHOR

...view details