Kohli Bodyguard: భద్రత విషయంలో సెలబ్రిటీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అడుగు బయటపెట్టాలంటే బాడీగార్డులు వారి వెంట ఉండాల్సిందే. తమకు రక్షణ కల్పించే సదరు బాడీగార్డ్‌లకు జీతాలు కూడా ఆ స్థాయిలోనే ఇస్తుంటారు. టీమ్ఇండియా కెప్టెన్, హీరోయిన్ అనుష్క శర్మ కూడా వారి అంగరక్షకుడికి భారీ మొత్తంలో జీతం ఇస్తున్నారు. అది టాప్ కంపెనీల్లో సీఈఓలకు ఇచ్చే జీతాల కంటే ఎక్కువ కావడం విశేషం.
ప్రకాశ్ సింగ్ ఉరఫ్ సోనూ.. కొన్నేళ్ల నుంచి అనుష్క శర్మకు బాడీగార్డ్‌గా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే స్టార్ క్రికెటర్ కోహ్లీని పెళ్లి చేసుకోకముందు నుంచే ఆమెకు రక్షణగా వెన్నంటే ఉంటూ వస్తున్నాడు. ఓ ప్రముఖ వెబ్సైట్ అంచనా ప్రకారం అతడికి ఏడాది రూ.1.2 కోట్ల పారితోషికం అందుతోందట. ఇది నిజమైతే చాలా కంపెనీల్లో సీఈఓలకు ఇచ్చే జీతం కంటే ఇది చాలా ఎక్కువే.