తెలంగాణ

telangana

ETV Bharat / sports

'షకిబుల్​ లాంటి ఆటగాళ్లు అవసరమా?' - షకిబుల్ అనుచిత ప్రవర్తన

బంగ్లా దేశవాళీ టీ20 లీగ్​లో అంపైర్​తో అతిగా ప్రవర్తించిన స్టార్​ ఆల్​రౌండర్​ షకిబుల్​ హసన్​పై క్రికెట్​ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా మాజీ ఆసీస్ మహిళా ప్లేయర్​ లీసా స్థలేకర్.. ఇటువంటి ఆటగాడు అవసరమా అంటూ ప్రశ్నించింది.

Lisa Sthalekar, australia cricketer
లీసా స్థలేకర్, ఆసీస్ మహిళా క్రికెటర్

By

Published : Jun 11, 2021, 9:52 PM IST

ఢాకా టీ20 లీగ్​లో భాగంగా ఫీల్డ్​ అంపైర్​తో అనుచితంగా ప్రవర్తించిన బంగ్లా స్టార్​ ఆల్​రౌండర్​ షకిబుల్​ హసన్​పై.. పలువురు ఆటగాళ్లతో పాటు అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే జెంటిల్​మన్​ గేమ్​లో ఇలాంటి ఆటగాళ్లు అవసరమా? అంటూ ప్రశ్నించింది ఆస్ట్రేలియా మహిళా మాజీ క్రికెటర్ లీసా స్థలేకర్. బంగ్లా యువ ఆటగాళ్లు అతన్ని అనుసరించవద్దని కోరింది.

"యువ క్రికెటర్లు ముఖ్యంగా బంగ్లాకు చెందిన వారు.. షకిబ్​ను అనుసరించరని అనుకుంటున్నా! మొదట అన్ని ఫార్మాట్ల క్రికెట్​ నుంచి నిషేధం(రెండేళ్లు, ఇందులో ఒక ఏడాది సస్పెండ్​) అయినా కూడా.. ఈ రోజు మరోసారి అతిగా ప్రవర్తించాడు. గేమ్​లో ఇలాంటి ఆటగాళ్లు అవసరమా? మీ ఆలోచనలను తెలుసుకోవాలని ఉంది."

-లీసా స్థలేకర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.

ఇదీ చదవండి:అంపైర్​తో షకిబుల్ వాగ్వాదం.. వీడియో వైరల్​

ABOUT THE AUTHOR

...view details