తెలంగాణ

telangana

ETV Bharat / sports

'విరాట్, నేను చాటింగ్ చేసుకుంటున్నాం- క్రికెట్ నేర్చుకున్నాక భారత్​కు వస్తా' - విరాట్ జకోవిచ్ ఫ్రెండ్​షిప్

Djokovic Virat Kohli Friendship: సెర్బియా టెన్నిస్ స్టార్ ప్లేయర్ జకోవిచ్, విరాట్ కోహ్లీతో తనకున్న ఫ్రెండ్​షిప్ గురించి తెలిపారు. తాజాగా సోనీ స్పోర్ట్స్ ఛానెల్​లో జకోవిచ్ విరాట్ గురించి మాట్లాడాడు.

Djokovic Virat Kohli Friendship
Djokovic Virat Kohli Friendship

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 7:39 PM IST

Updated : Jan 13, 2024, 8:10 PM IST

Djokovic Virat Kohli Friendship:టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో తనకు మంచి సన్నిహిత్యం ఉందన్నాడు సెర్బియన్ టెన్నిస్ దిగ్గజ ఆటగాడు నొవాక్ జకోవిచ్. తాజాగా సోనీ స్పోర్ట్స్ 5లో లైవ్​లో మాట్లాడిన జకోవిచ్ ఈ విషయం చెప్పాడు. 'విరాట్ కోహ్లీతో గత కొన్నేళ్లుగా నేను చాట్ (మెసేజ్) చేస్తున్నా. కానీ, మేమిద్దరం కలిసే ఛాన్స్ ఇప్పటిదాకా రాలేదు. విరాట్​ తన కెరీర్​లో ఎంతో సాధించాడు. అతడిని నేను ఎప్పుడూ అభినందిస్తా. విరాట్​తో మాట్లాడడం గౌరవంగా భావిస్తున్నా. భారత్, ఆస్ట్రేలియాలో క్రికెట్ అతి పెద్ద క్రీడా. నేనూ క్రికెట్ ఆడడం ప్రారంభించాను. కానీ, అంత గొప్పగా ఏమీ ఆడను. క్రికెట్​ గేమ్​లో పర్ఫెక్ట్ అయ్యాక భారత్​కు వెళ్తా' అని జకోవిచ్ అన్నాడు. దీంతో ఈ వీడియోను విరాట్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.

Novak Djokovic 2023:2023లో యుఎస్‌ ఓపెన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, డబ్ల్యూటీఏ టోర్నీ నెగ్గిన జకోవిచ్ నెం.1గా ఏడాదిని ముగించాడు. అసోషియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్​ ర్యాంకింగ్స్​లో ఎనిమిదోసారి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో జకోవిచ్ 402 వారాలు టాప్​లో కొనసాగుతున్నాడు.

Novak Djokovic Cricket:జకోవిచ్ ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్​షిప్స్ ఆడుతున్నాడు. రీసెంట్​గా ఈ టోర్నీ ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వెళ్లాడు. ఈ నేపథ్యంలో జకోవిచ్ టెన్నిస్ కోర్టులో సరదాగా క్రికెట్ ఆడాడు. కాసేపు బ్యాటింగ్ చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు.

Virat Kohli 2023:2023 సంవత్సరంలో విరాట్ అత్యుత్తమ ఫామ్ కనబర్చాడు. వన్డే, టెస్టు ఫార్మాట్​లో కలిపి విరాట్ గతేడాది 2048 పరుగులు నమోదు చేశాడు. ఈ క్రమంలో క్రికెట్​లో అత్యధికసార్లు (8) క్యాలెండర్ ఇయర్​లో 2000+ పరుగులు చేసిన బ్యాటర్​గా రికార్డు సృష్టించాడు. ముఖ్యంగా 2023 వన్డే వరల్డ్​కప్​లో విరాట్ ప్రదర్శన అద్భుతం. 11 మ్యాచ్​ల్లో కలిపి 765 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఇక వన్డేల్లో 50 శతకాలు కూడా 2023లోనే సాధించాడు.

వింబుల్డన్‌ కోటలో కొత్తరాజు.. జకోవిచ్‌పై సంచలన విజయం

కొత్త ఏడాదిలో కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఇవే!

Last Updated : Jan 13, 2024, 8:10 PM IST

ABOUT THE AUTHOR

...view details