తెలంగాణ

telangana

ETV Bharat / sports

Raghavendra Rao: దర్శకేంద్రుడి స్పెషల్‌.. 'వెండితెర వేల్పులు' - Vendithera Velpulu

Raghavendra Rao: వెండితెరపై అనేక కళాఖండాలు సృష్టించిన దిగ్గజ దర్శకుడు.. కే.రాఘవేంద్రరావు. పాటకు పట్టాభిషేకం చేసి.. సాధారణ నటులను సైతం స్టార్​లుగా తీర్చిదిద్దిన ఆయన ప్రస్థానమే ఓ చరిత్ర. రాఘవేంద్రరావు సినీప్రస్థానంపై ఈటీవీ 'వెండితెర వేల్పులు' కార్యక్రమంలో నేడు (ఆదివారం) ప్రసారంకానుంది. తప్పకచూడండి.

Raghavendra Rao
Vendithera Velpulu

By

Published : Mar 27, 2022, 7:30 AM IST

Updated : Mar 27, 2022, 7:45 AM IST

Raghavendra Rao: ఆయనో తెలుగు సినీ మహర్షి. పాటకు పట్టాభిషేకం చేసిన రాజర్షి. ఆయన పాటలు సన్నజాజులు. తెరపై విరబూసిన విరజాజులు. ఆయన ప్రస్థానమే ఓ చరిత్ర. ప్రేక్షకుల పల్స్‌ తెలిసిన ఇంద్రజాలికుడు.. బాక్సాఫీసు బద్దలు కొట్టిన దర్శకేంద్రుడు. ఆయనెవరో కాదు కోవెలమూడి రాఘవేంద్రరావు.

వందకుపైగా చిత్రాలకు దర్శకత్వం వహించి, ఎందరో నటులను స్టార్‌లుగా మార్చిన ఆయన గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకునేందుకు ఈవారం 'వెండితెర వేల్పులు' కార్యక్రమం సిద్ధమైంది. ఆ'దర్శకేంద్రుడి' స్పెషల్‌ ఎపిసోడ్‌ 'ఈటీవీ' వార్త ఛానళ్లలో ఈ ఆదివారం ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 6.30 లకు, రాత్రి 10.30 గం.లకు ప్రసారం కానుంది. తప్పకచూడండి.

ఇదీ చూడండి:'ఆర్​ఆర్​ఆర్'​ సక్సెస్​పై రామ్​చరణ్​ ట్వీట్​.. ఓటీటీలో 'వలిమై' రికార్డు

Last Updated : Mar 27, 2022, 7:45 AM IST

ABOUT THE AUTHOR

...view details