టీమ్ఇండియా యువ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ (Rishabh Pant)పై ప్రశంసల జల్లు కురిపించాడు భారత వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్(Dinesh Karthik). మాజీలు వీరేంద్ర సెహ్వాగ్, గిల్‌క్రిస్ట్ లాగే.. ప్రత్యర్థి జట్లపై ప్రభావం చూపిస్తున్నాడని కొనియాడాడు. క్రికెట్లో అతడు అంచెలంచెలుగా ఎదుగుతున్నాడని తెలిపాడు. ఐపీఎల్‌తో చాలా మంది వికెట్ కీపర్ బ్యాట్స్మన్లు వెలుగులోకి వచ్చారని పేర్కొన్నాడు. ప్రపంచంలోని అత్తుత్తమ వికెట్ కీపర్లలో సాహా ఒకడని అభిప్రాయపడ్డాడు. తాను ఫిట్‌గా ఉన్నంతవరకు క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు. క్రికెట్ వ్యాఖ్యాతగా మారబోతున్నందుకు సంతోషంగా ఉందని డీకే తెలిపాడు.
"రిషభ్ పంత్ జట్టుకు ఫ్లెక్సిబిలిటీ తీసుకొస్తాడు. అవసరం మేరకు అదనపు బౌలర్ లేదా బ్యాట్స్‌మన్‌ను తీసుకొనేందుకు జట్టు యాజమాన్యానికి అవకాశం దొరుకుతుంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే అతడు ప్రత్యర్థి మనసులో భయం పెంచుతాడు. వీరేంద్ర సెహ్వాగ్(Sehwag), ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్రత్యర్థిపై చూపించిన ప్రభావమే అతడూ చూపిస్తున్నాడు."