తెలంగాణ

telangana

ETV Bharat / sports

కేఎల్​ రాహుల్​పై దినేశ్​ కార్తిక్ కామెంట్స్​​.. అలా అనేశాడేంటి? - కేఎల్ రాహుల్​ దినేశ్ కార్తిక్​ తొలి టెస్టు

బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా కేఎల్ రాహుల్​ చేసిన వ్యాఖ్యలపై దనేశ్ కార్తిక్​ స్పందించాడు. అలా అనడం కరెక్ట్ కాదని పేర్కొన్నాడు.

DK KL Rahul
కేఎల్​ రాహుల్​పై దినేశ్​ కార్తిక్ కామెంట్స్​​.. అలా అనేశాడేంటి?

By

Published : Dec 15, 2022, 4:43 PM IST

టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసు నేపథ్యంలో బంగ్లాదేశ్‌ సిరీస్‌లో దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉందని కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలపై సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌ తాజాగా స్పందించాడు. తాను కేఎల్‌ రాహుల్‌ వ్యాఖ్యలతో ఏకీభవించనని అన్నాడు. చట్‌గావ్‌లో ఉన్న పిచ్‌పై ఇంగ్లాండ్‌ జట్టు ఆడినట్టు బజ్‌బాల్‌ తరహా ప్రదర్శన సాధ్యం కాదని పేర్కొన్నాడు.

"నాకు తెలిసి ఇలాంటి వికెట్‌ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు. సాధారణంగా నాణ్యమైన ఆటగాళ్లు లేనప్పుడు బ్యాటింగ్‌ వైఫల్యాలు బయటపడుతుంటాయి. నియంత్రణ కోల్పోకుండా ఆడితే చాలు. వికెట్‌ను కాపాడుకోవడానికి గొప్ప టెక్నిక్‌లేమీ అవసరం లేదు. ఇక ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ క్రికెట్‌ ఆడినట్టుగా టీమ్‌ఇండియా ఆడదు. అది జట్టు డీఎన్‌ఏలోనే లేదు. నిజానికి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రేసులో మంచి స్కోరుతో నిలవడానికి ఈ మ్యాచ్‌లు చాలా కీలకమైనవి. అందుకే, వేగం పెంచి ఆడాలని వారు భావిస్తున్నారు. కానీ, అందుకు ఇది సరైన సమయం కాదు. ఇక్కడ దూకుడుగా ఆడేందుకు పిచ్‌ ఏమాత్రం సహకరించదు" అని డీకే అన్నాడు.

కాగా, బంగ్లాతో తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. టీమ్‌ఇండియా బౌలర్ల ధాటికి ఆట ముగిసేసమయానికి బంగ్లా ఎనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. క్రీజ్‌లో మెహిదీ మిరాజ్ (16*), ఎబాడట్‌ హోస్సేన్ (13*) ఉన్నారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 31 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్‌దీప్‌ 4, సిరాజ్ 3, ఉమేశ్‌ యాదవ్ ఒక వికెట్ తీశారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌ ఇంకా 271 పరుగులు వెనుకబడి ఉంది.

ఇదీ చూడండి:IND VS BAN: ముగిసిన రెండో రోజు ఆట.. భారత బౌలర్లు భళా

ABOUT THE AUTHOR

...view details