తెలంగాణ

telangana

ETV Bharat / sports

దినేశ్​ కార్తీక్‌ సంచలన నిర్ణయం!.. 'ప్లీజ్‌ డీకే.. వద్దు' అంటున్న ఫ్యాన్స్‌ - దినేశ్​ కార్తీక్​ ఇన్​స్టాగ్రామ్​

భారత క్రికెట్​ జట్టు ఫినిషర్​ దినేశ్​ కార్తీక్​ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్​బై చెప్పనున్నాడా? అని అంటే నెట్టింట అవుననే సమాధానం వస్తోంది. తాజాగా డీకే ఇన్​స్టాలో పోస్ట్​ చేసిన వీడియో రిటైర్మెంట్​ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది. అసలేం జరిగింది? ఆ వీడియోలో ఏముంది?

dinesh karthik announced retirement international cricket reports
dinesh karthik announced retirement international cricket reports

By

Published : Nov 24, 2022, 1:41 PM IST

Dinesh Karthik Retirement: టీమ్​ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్​ కార్తీక్‌ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కార్తీక్‌ పోస్ట్‌ చేసిన ఓ వీడియోతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది. ప్రపంచకప్‌లో ఆడాలన్న తన కలను నెరవేర్చుకోవడంలో సహకరించిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లకు, తన అభిమానులకు కార్తీక్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కార్తీక్‌ భావోద్వేగ వీడియోను పంచుకున్నాడు.

"టీమ్​ఇండియా తరఫున టీ20 ప్రపంచకప్‌ ఆడాలనే లక్ష్యం కోసం చాలా కష్టపడ్డాను. ఇప్పుడు నా కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో మేము విజయం సాధించకపోవచ్చు.. కానీ ఎన్నో జ్ఞాపకాలు నా జీవితంలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాయి. నాకు మద్దతుగా నిలిచిన నా తోటి ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులకు ధన్యవాదాలు" అంటూ డీకే ఉద్వేగపూరిత క్యాప్షన్‌ జతచేశాడు.

ఈ క్రమంలో కార్తీక్‌ వీడియోపై స్పందించిన అభిమానులు.. "ప్లీజ్‌ డీకే.. వద్దు.. ఇప్పుడే రిటైర్మెంట్‌ ప్రకటించకు.. మేము దానికి ఇంకా సిద్ధంగా లేము" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది నెటిజన్లు.. త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్లు డీకే సంకేతాలు ఇచ్చాడని అభిప్రాయపడుతున్నారు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున అదరగొట్టిన కార్తీక్‌.. ఫినిషర్‌గా భారత జట్టులో పునరాగమనం చేశాడు. అయితే ఫినిషర్‌గా టీ20 ప్రపంచకప్‌ భారత జట్టులో చోటు దక్కించుకున్న కార్తీక్‌.. అంచనాలకు తగ్గట్టు రాణించడంలో విఫలమయ్యాడు. కీలక మ్యాచ్‌లలో పంత్‌ను కాదని డీకేకు అవకాశం ఇచ్చినప్పటికీ సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యాడు. దీంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు కార్తీక్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.

అయితే వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ సన్నాహాకాల్లో భాగంగా భారత్‌ ఎక్కువగా వన్డే సిరీస్‌లు ఆడనుంది. కాబట్టి కార్తీక్‌ కెరీర్‌ దాదాపు ముగిసినట్టే అని చెప్పుకోవాలి. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌కు కార్తీక్‌ కూడా గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details