Dhoni Pakistan visit :టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తన ఆటకే కాకుండా తన వ్యక్తిత్వానికి దేశ విదేశాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా ధోనీని పాకిస్థాన్‌కు రమ్మంటూ ఓ వ్యక్తి ఆహ్వానించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే ?
క్రికెట్లో ఉన్నప్పుడు టోర్నీల కోసం 2006-08 మధ్య కాలంలో ధోనీ పాకిస్థాన్‌కు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడి ఫుడ్‌ను ఆయన టేస్ట్ చేశాడు. అది మాహీకి ఎంతో నచ్చిందట. ఇదే విషయాన్ని ఇటీవలే ఓ అభిమానితో పంచుకున్నాడు. అక్కడి ఫుడ్ చాలా బాగుంటుందంటూ తన మనసులో మాట చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. అయితే దాన్ని చూసి పాకిస్థాన్ స్పోర్ట్స్ యాంకర్ ఫఖర్ ఆలం ఈ విషయంపై స్పందించారు. పాకిస్థాన్ ఫుడ్ గురించి ధోనీ మాట్లాడటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దీంతో క్రికెట్ కోసమే కాకుండా ఫుడ్ టేస్ట్ చేసేందుకు మరోసారి పాకిస్థాన్‌కు రావాలంటూ ధోనీని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.