ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్‌లో (IPL 2021) మిగతా మ్యాచ్‌లు ఆడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అందరికన్నా ముందే సన్నద్ధం అవుతోంది. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) మంగళవారమే చెన్నైకు చేరుకున్నాడు. అతడితో పాటు భార్య సాక్షి, కుమార్తె జీవా కూడా వెంటవచ్చారు. అందుకు సంబంధించిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న సీఎస్కే జట్టు సంతోషం వ్యక్తం చేసింది. ప్రపంచ సింహాల దినమైన ఆగస్టు 10న తమ సింహం చెపాక్‌కు చేరుకుందని పేర్కొంది.
MS Dhoni: చెపాక్ చేరిన సీఎస్కే సింహం.. ప్రాక్టీస్ కోసమే - చెన్నైలో ధోనీ
ఐపీఎల్ (IPL 2021) రెండో దశలో భాగంగా ప్రాక్టీస్ కోసం చెన్నై చేరుకున్నాడు సీఎస్కే కెప్టెన్ ధోనీ (MS Dhoni). అతడితో పాటు భార్య సాక్షి, కుమార్తె జీవా వెంటవచ్చారు. దీనిపై స్పందించిన చెన్నై ఫ్రాంఛైజీ.. ప్రపంచ సింహాల దినోత్సవమైన ఆగస్టు 10న తమ సింహం చెపాక్ చేరుకుందని పేర్కొంది.
ధోనీ ఇక్కడ కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసి తర్వాత ఆగస్టులో తమ జట్టుతో పాటు యూఏఈకి వెళ్లే అవకాశం ఉంది. అక్కడ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ సీజన్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లు జరగనున్నాయి. మరోవైపు భారత్‌లో నిర్వహించిన ఐపీఎల్‌లో బయోబుడగలోని పలువురు ఆటగాళ్లు వైరస్ బారిన పడటం వల్ల మే 4న టోర్నీని నిరవధికంగా వాయిదా వేశారు నిర్వాహకులు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో సీఎస్కే ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. దీంతో సెప్టెంబర్‌లో తిరిగి ప్రారంభమైనప్పుడు కూడా ఇలాంటి ప్రదర్శనే చేసి విజేతగా నిలవాలని ధోనీ భావిస్తున్నాడు. అందుకోసమే అతడు అందరికన్నా ముందు చెన్నై చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు.
ఇదీ చదవండి:Naresh Tumda: ప్రపంచకప్ గెలిచిన ప్లేయర్.. ప్రస్తుతం కూలీగా