తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ పుట్టినరోజు వేడుకలు.. పంత్‌ సందడి .. వీడియో వైరల్‌ - ధోనీ పుట్టిన రోజు వీడియా

Dhoni Birthday: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ గురువారం 42వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. మహీ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్​ విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ కేక్​ కటింగ్​ వీడియాను అతడి భార్య సాక్షి ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసింది. ఆ వీడియోను మీరూ ఓ సారి చూసేయండి.

dhoni birthday celebrations
dhoni birthday celebrations

By

Published : Jul 7, 2022, 10:56 AM IST

Dhoni Birthday Celebrations: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్న టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. గురువారం తన 41వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న ధోనీ.. భార్య సాక్షితోపాటు కొద్దిమంది స్నేహితుల సమక్షంలో కేక్ కట్ చేసి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన మహీ బర్త్ డే వేడుకల్లో టీమ్​ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్​ రిషభ్​ పంత్ కూడా పాల్గొన్నాడు. మిస్టర్​ కూల్​ బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోను ఆయన భార్య సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

బర్త్ డే వేళ మహీకి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి విషెస్​ వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్‌లో ధోనీ స్పెషల్ ఇన్నింగ్స్​ను షేర్ చేస్తూ నెటిజన్లు విషెస్ చెబుతున్నారు. క్రికెట్‌లో ధోనీ రికార్డులను, మిస్టర్​ కూల్​ వచ్చాక టీమ్​ఇండియా సాధించిన విజయాలను మరోసారి గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో #HBDMSDhoni హాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.

చెరిగిపోని ముద్ర.. టీమ్​ఇండియా కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చెరిగిపోని ముద్ర వేశాడు. మైదానంలో ధోనీ నాయకత్వ లక్షణాలు, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కూల్‌గా వ్యవహరించే తీరు కెప్టెన్‌గా ధోనీని ప్రత్యేకంగా నిలిపాయి. కీపర్‌గా, బ్యాటర్‌గా, కెప్టెన్‌గా మహీ ఆ బాధ్యతలకే వన్నె తెచ్చాడంటే అతిశయోక్తి కాదు. కెప్టెన్ కూల్ మైదానంలో ఉన్నాడంటే జట్టుకు గొప్ప భరోసా. అతడు క్రీజులో ఉన్నాడంటే చివరి బంతికైనా విజయం సాధిస్తామనే నమ్మకం.

ఏ మాత్రం తగ్గని క్రేజ్​.. 2011 ప్రపంచ కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై ధోనీ బాదిన విన్నింగ్ సిక్సర్ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. నాయకుడిగా మహీ గురించి ఎంత చెప్పినా తక్కువే. భారత క్రికెట్​ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీ 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించి పెట్టాడు. టీమ్​ఇండియాకు మూడు ఐసీసీ టోర్నీలు సాధించిపెట్టిన ఏకైక కెప్టెన్ ధోనీనే కావడం విశేషం. ఆగస్టు 15, 2020న మిస్టర్​ కూల్​ ఇంటర్నేషనల్ క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించాడు. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుని రెండేళ్లు గడుస్తున్నా ధోనీ క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు.

ఇవీ చదవండి:చివరి వింబుల్డన్​లో సానియా ఓటమి.. మ్యాచ్​లో ధోనీ, గావస్కర్ సందడి

'బజ్‌బాల్‌' అంటే ఏమిటీ? ఆ పేరు ఎలా వచ్చింది?

ABOUT THE AUTHOR

...view details