Dhoni Bikes Collection : టీమ్ఇండియా మాజీ సారధి కెప్టెన్ కూల్ధోనీకి ఆటంటే ఎంత ఇష్టమో బైక్స్ కూడా అంతే ఇష్టం. తనకు నచ్చిన బైక్ కనిపిస్తే చాలు ఇక మరుక్షణం అది తన గ్యారేజ్‌లో ఉండి తీరాల్సిందే. అలా ఇప్పటివరకు మ్యాచ్‌లో గెలుచుకున్న బైక్స్ నుంచి తను కొనుగోలు చేసిన వాహనాల వరకు రాంచీ ఫామ్‌హౌస్‌లో భారీ కలెక్షనే ఉంది. పలు సందర్భాల్లో ధోనీ కూడా తనకు బైక్స్పైనున్న అమితమైన ప్రేమ గురించి ప్రస్తావించాడు. అయితే తాజాగా మాజీ క్రికెటర్స్ వెంకటేశ్ ప్రసాద్, సునీల్ జోషీ రాంచీలోని ధోని ఇంటికి వెళ్లి అతనితో కాసేపు టైమ్ స్పెండ్ చేశారు. ఈ క్రమంలో తీసిన ఓ వీడియోను వెంకటేశ్ ప్రసాద్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు.
"బైకులంటే మక్కువ కలిగిన వ్యక్తుల్లో ధోనీ ఒకరు. ఇది ఎంతో గొప్ప కలెక్షన్. ధోని ఓ గొప్ప సాధకుడు, అద్భుతమైన వ్యక్తి. ఇది రాంచిలోని నివాసంలో బైక్స్, కార్ల కలెక్షన్ల గ్లింప్స్" అంటూ ఆ వీడియోను వెంకటేశ్ ప్రసాద్ పంచుకున్నాడు. ధోనీ భార్య సాక్షి తీసిన ఆ వీడియోలో ధోనీ గ్యారేజ్ కనిపిస్తుండగా.. ఆ గ్యారేజ్ మొత్తం వివిధ రకాల బైక్స్, కార్స్‌తో నిండుగా ఉంది. సుమారు వంద కంటే ఎక్కువ బైకులు అందులో కనిపిస్తుండటం విశేషం. ఇక ధోనీ, సాక్షితో పాటు వెంకటేష్, సునీల్ మధ్య జరిగిన ఓ సంభాషణ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటోంది.