ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ రెండు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం 16వ స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకతో సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించడం గబ్బర్‌కు కలిసొచ్చింది.
అలాగే టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 848 పాయింట్లతో రెండో ర్యాంకులో ఉండగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 817 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక ఈ విభాగంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 873 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
బౌలింగ్ విభాగానికొస్తే భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 20వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. లంక బౌలర్ హసరంగ ఏకంగా 22 స్థానాలు మెరుగుపరుచుకుని 36వ స్థానానికి ఎగబాకాడు. దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రైజ్ షంషి ఎనిమిది స్థానాలు పైకి చేరి ప్రస్తుతం 39వ ర్యాంకులో ఉన్నాడు.