శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టు సాధన షురూ చేసింది. క్వారంటైన్ ముగిసిన తర్వాత శుక్రవారం తొలి సెషన్‌లో శిక్షణ ప్రారంభించింది. టీమ్ఇండియా యువ క్రికెటర్లు ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. జులై 13 నుంచి శ్రీలంకతో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
India vs Srilanka: ప్రాక్టీస్ మొదలుపెట్టిన గబ్బర్‌సేన - ఇండియా Vs శ్రీలంక
పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు శ్రీలంక వెళ్లిన భారత జట్టు సాధన షురూ చేసింది. క్వారంటైన్ ముగించుకొని శుక్రవారం తొలి సెషన్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. దానికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది.
లంక పర్యటన కోసం యువ క్రికెటర్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. సోమవారం కొలంబోకు చేరుకున్న గబ్బర్ సేన మూడు రోజులు క్వారంటైన్‌లో గడిపింది. నిర్బంధం తర్వాత ఇప్పుడు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ సిరీస్‌తో చేతన్ సకారియా, కృష్ణప్ప గౌతమ్, నితీశ్ రాణా, దేవదత్ పడిక్కల్, వరుణ్ చక్రవర్తి, రుతురాజ్ గైక్వాడ్ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారు. పృథ్వీషా, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్‌కు ఎంపికవ్వాలని పట్టుదలతో ఉన్నారు. బీసీసీఐ సాధనకు సంబంధించిన చిత్రాలను ట్విటర్ ద్వారా పంచుకుంది.
ఇదీ చూడండి..ధోనీ, కోహ్లీ కాదు.. భారత ధనిక క్రికెటర్ ఎవరు?