తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ ఘనత సాధించిన పదో ఆటగాడిగా ధావన్​ - శిఖర్​ ధావన్ సరికొత్త రికార్డులు

టీమ్ఇండియా ఆటగాడు శిఖర్​ ధావన్​ కెప్టెన్​గా అరంగేట్ర మ్యాచ్​లోనే పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 95 బంతుల్లో 86 పరుగులతో కెప్టెన్​ ఇన్నింగ్స్​ ఆడిన గబ్బర్​.. వన్డేల్లో 6 వేల పరుగులు పూర్తి చేసిన పదో భారత బ్యాట్స్​మన్​గా నిలిచాడు. దీంతో పాటు మరికొన్ని రికార్డులు సాధించాడు. అవేంటో మీరూ తెలుసుకోండి.

shikhar dhawan, indian captain
శిఖర్ ధావన్, టీమ్ఇండియా కెప్టెన్

By

Published : Jul 18, 2021, 10:59 PM IST

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే నానుడిని తిరగరాశాడు భారత కెప్టెన్ శిఖర్​ ధావన్​. లంక పర్యటనలో సారథిగా తొలి వన్డేతోనే పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు గబ్బర్​. అవేంటో మీరు చదివేయండి.

  • లంకతో మ్యాచ్​లో 95 బంతుల్లో 86 పరుగులు చేసిన ధావన్​.. కెప్టెన్ ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో 50 ఓవర్ల ఫార్మాట్​లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన పదో భారత బ్యాట్స్​మన్​గా నిలిచాడు గబ్బర్​.
  • ఇందుకు గానూ శిఖర్​ 140 ఇన్నింగ్స్​లు తీసుకున్నాడు. ఈ క్రమంలో వివ్​ రిచర్డ్స్​, జో రూట్ (వీరిద్దరూ 141 ఇన్నింగ్స్​లు)​లను వెనక్కి నెట్టాడు. హషీమ్​ ఆమ్లా(123 ఇన్నింగ్స్​లు), విరాట్ కోహ్లీ(136 ఇన్నింగ్స్​లు), కేన్ విలియమ్సన్​(139 ఇన్నింగ్స్​లు) అతడి కంటే ముందున్నారు.
  • ఆరు వేల మార్క్​ను అందుకున్న వారిలో అతడి కంటే ముందు సచిన్ తెందుల్కర్, విరాట్ కోహ్లీ, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, ధోనీ, మహమ్మద్​ అజారుద్దీన్, రోహిత్ శర్మ, యువరాజ్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నారు.
  • హాఫ్​ సెంచరీతో రాణించిన ధావన్​ శ్రీలంకపై వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. అదీ 17 ఇన్నింగ్స్​ల్లోనే. భారత మాజీ కెప్టెన్ గంగూలీ ఇందుకు​ 20 ఇన్నింగ్స్​లు తీసుకున్నాడు. ఈ క్రమంలో దాదా రికార్డును తిరగరాశాడు శిఖర్.
  • కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్​లోనే అర్ధ శతకం బాదిన ఐదో భారతీయుడిగా ధావన్​ సరికొత్త ఫీట్​ సాధించాడు. అతడికంటే ముందు అజిత్​​ వాడేకర్, రవిశాస్త్రి, సచిన్ తెందుల్కర్​, అజయ్ జడేజా, ధోనీ ఉన్నారు.
  • వన్డేలో 33వ అర్ధ శతకం సాధించిన శిఖర్​.. అంతర్జాతీయ కెరీర్​లో 10వేల మార్క్​ను అందుకున్నాడు. ఈ ఘనత అందుకున్న 14వ భారత బ్యాట్స్​మన్​ ఆయన.
  • కెప్టెన్​గా తొలి మ్యాచ్​లోనే జట్టుని ముందుండి గెలిపించాడు ధావన్​.

ABOUT THE AUTHOR

...view details