ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ కెప్టెన్సీలో టీమ్ఇండియా, శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో ఆటగాళ్లంతా ముందుగా 14 రోజుల క్వారంటైన్లో ఉండనున్నారు. ఇందుకోసం జూన్ 14న వీరంతా సమావేశమై.. అదే రోజున నిర్బంధంలోకి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి తెలిపారు.
"ఆటగాళ్లు సోమవారం సమావేశమై.. రెగ్యులర్ టెస్టులు చేయించుకుని 14 రోజుల నిర్బంధంలోకి వెళ్లనున్నారు. మొదటి ఏడురోజులు కఠిన క్వారంటైన్, తర్వాతి ఏడు రోజులు సాఫ్ట్ క్వారంటైన్లో(ఇండోర్ ట్రైనింగ్) ఉంటారు. ఆ తర్వాత కొలంబొకు బయలుదేరుతారు. అక్కడికి చేరుకున్నాక శిక్షణకు ముందు మళ్లీ మూడు రోజుల పాటు జులై 4 వరకు హార్డ్ క్వారంటైన్లో ఉంటారు. అనంతరం జులై 12వరకు బయోబబుల్‌లో ట్రైనింగ్ అవుతారు. ఇంట్రా స్క్వాడ్ గేమ్స్ ఆడతారు"
-బీసీసీఐ అధికారి.