CHAHAL DHANASHREE: టీమిండియా బౌలర్ యుజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో ఆ జంట విడిపోతోందేమోనన్న వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అయితే, అవన్నీ రూమర్లేనని.. వాటిని నమ్మొద్దంటూ వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లకు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా ధనశ్రీ ఇన్‌స్టాలో ఓ రీల్ షేర్ చేస్తూ ఆ ఊహాగానాలకు మరోసారి చెక్‌పెట్టే ప్రయత్నం చేశారు. భార్య పుట్టింటికి వెళ్తే భర్త సంబురపడిపోతాడు అనేలా.. తాను నెల రోజులపాటు పుట్టింటికి వెళతాను అని ధనశ్రీ చెప్పగానే.. చాహల్ ఆనందంతో డ్యాన్స్ చేస్తాడు. అతడి నృత్యం చూసిన ధనశ్రీ నవ్వులు చిందిస్తోన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈరోజు ఉదయం షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 7.7లక్షల మంది లైక్ చేయగా.. దీనిపై కామెంట్ల వర్షం కురుస్తోంది.
ఒక్క రీల్‌తో విడాకులపై చాహల్, ధనశ్రీ క్లారిటీ - చాహల్ ధనశ్రీల జంట
టీమిండియా బౌలర్ చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారని వస్తున్న వార్తలపై ధనశ్రీ మరోసారి క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. దీనిపై కామెంట్ల వర్షం కురుస్తోంది.
తమ రిలేషన్‌షిప్‌కు సంబంధించి వచ్చిన రూమర్లను నమ్మొద్దంటూ ఇటీవల చాహల్-ధనశ్రీ వేర్వేరుగా కోరిన విషయం తెలిసిందే. తమపై వచ్చే ఎలాంటి రూమర్లను నమ్మొద్దని, దయచేసి వీటికి ముగింపు పలకాలంటూ చాహల్ వేడుకున్నాడు. ఆపై ధనశ్రీ కూడా స్పందిస్తూ.. ఇలాంటి పుకార్లు కలచివేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు గాయమవడంతో విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ లిగ్మెంట్ గతి తప్పిందని.. త్వరలోనే మరో సర్జరీ చేయించుకోబోతున్నట్లు తెలిపింది.
ఇవీ చదవండి