'పుష్ప' హవా కొనసాగుతోంది. ఈ చిత్రంలో పాటలు, డైలాగ్స్ ఆకట్టుకోవడం వల్ల సోషల్ మీడియాలో అందరూ రీల్స్ చేసేస్తున్నారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. ఇటీవల కాలంలో ముఖ్యంగా క్రికెటర్లు తమదైన శైలిలో రీల్స్ చేసి అభిమానులను సందడి చేస్తున్నారు. డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజాలు చేసిన రీల్స్ వైరలయ్యాయి. తాజాగా ఈ జాబితాలో చాహల్ భార్య ధనశ్రీ చేరారు.
'పుష్ప' పాటకు చాహల్ భార్య స్టెప్పులు- అదరగొట్టిందిగా! - ధనశ్రీ చాహల్
'పుష్ప' పాటకు టీమ్ఇండియా క్రికెటర్ చాహల్ భార్య ధనశ్రీ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 'నా సామి' అంటూ సాగే పాటకు వీడియా చేసి అభిమానులను అలరించారు.
'పుష్ప'
'పుష్ప'లో 'నా సామి' అంటూ సాగే పాటకు స్టెప్పులేస్తూ ఫాలోవర్స్‌ను అలరించారు ధనశ్రీ. ఆ పాటలో రష్మిక వేసిన స్టెప్పులను అనుసరిస్తూ చేసిన వీడియోకు ధనశ్రీ అభిమానులతో పాటు ఇటు అల్లు అర్జున్, రష్మిక ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు. ఇన్‌స్టాలో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇదీ చూడండి :వార్నర్‌కు పోటీగా జడేజా.. 'పుష్ప' వీడియోతో 'తగ్గేదే లే'