Devon Conway Record: న్యూజిలాండ్ బ్యాటర్ డేవిడ్ కాన్వే టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ చేయడం ద్వారా.. ఈ ఫార్మాట్లో తొలి ఐదు టెస్టుల్లోని మొదటి ఇన్నింగ్స్ అన్నింటిలోనూ హాఫ్ సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా ఘనత వహించాడు.
గతేడాది జూన్‌లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు ద్వారా సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు కాన్వే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత డబుల్ సెంచరీ (200)తో సత్తాచాటాడు. తర్వాత ఎడ్జ్‌బాస్టన్ టెస్టులోనూ 80 పరుగులతో రాణించాడు. అలాగే టీమ్ఇండియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో 84 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ (122)తో మెరిశాడు. ఆదివారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు ఆటముగిసే సమయానికి 99 పరుగులతో క్రీజులో ఉన్నాడు.