Deodhar Trophy Riyan Parag : మైదానంలో అతి ప్రవర్తన కారణంగా ఓవరాక్షన్ ప్లేయర్‌గా ముద్ర వేసుకున్న టీమ్ఇండియా యువ ఆటగాడు రియాన్ పరాగ్.. తనను తిట్టిన నోళ్లతోనే శభాష్ అనిపించుకున్నాడు. తాజాగా ముగిసిన దియోదర్ ట్రోఫీ-2023లో బ్యాట్‌తోపాటు బంతితో కూడా చెలరేగి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన రియాన్.. టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2 సెంచరీలు, అర్ధసెంచరీ సాయంతో 88.50 సగటున 354 పరుగులు సాధించాడు. బంతితోనూ రియాన్ మెరిశాడు. 19.09 సగటున 11 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రియాన్.. ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు.
Deodhar Trophy Riyan Parag Highlights : 2023 దియోదర్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టు తరఫున ఆడిన రియాన్.. కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. అయితే సౌత్ జోన్‌తో గురువారం (ఆగస్ట్ 3) జరిగిన ఫైనల్లోనూ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కానీ తన జట్టును విజేతగా నిలిపేందుకు శత విధాల ప్రయత్నించి విఫలమయ్యాడు. తొలుత బంతితో (2/68) మ్యాజిక్ చేసిన రియాన్.. ఆ తర్వాత బ్యాట్‌తో చెలరేగి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 65 బంతులు ఎదుర్కొన్న రియాన్.. 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. భారీ లక్ష్య ఛేదనలో కుమార్ కుషాగ్రాతో (68) కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన రియాన్.. ఆరో వికెట్‌గా వెనుదిరగడంతో ఈస్ట్ జోన్ ఓటమి ఖరారైంది.