తెలంగాణ

telangana

నయా 'ఛోకర్స్​'- టీమ్​ఇండియాపై ట్రోల్స్​!

ఐసీసీ టోర్నీ తొలి నుంచి అద్భత ప్రదర్శన చేసే టీమ్​ఇండియా.. ఆఖర్లో చేతులెత్తేస్తోంది. ఏడేళ్లుగా టైటిల్​ మనదే అనుకున్న ప్రతిసారీ అభిమానులకు నిరాశనే మిగుల్చుతోంది. దీంతో టీమ్​ఇండియాను ఛోకర్స్​ అంటూ పిలుస్తున్నారు.

By

Published : Jun 24, 2021, 9:57 PM IST

Published : Jun 24, 2021, 9:57 PM IST

World Test Championship
టీమ్​ఇండియా ఛోకర్స్

విధి వైపరిత్యమో లేక దురదృష్టమో గానీ.. ఐసీసీ టోర్నీ ఫైనల్​కు వచ్చేసరికి టీమ్​ఇండియా తడబాటు కొనసాగుతూనే ఉంది. తొలి నుంచి అద్భుతంగా ఆడే జట్టు.. తుది పోరులో చేతులెత్తేస్తోంది. ఇంగ్లాండ్​ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో న్యూజిలాండ్​తోనూ అదే పునరావృతమైంది. దీంతో టీమ్​ఇండియాను 'ఛోకర్స్​' అని ట్రోల్​ చేస్తున్నారు అభిమానులు.

టీమ్​ఇండియాపై అభిమానుల అసంతృప్తి..

ఛోకర్స్​ అంటే తొలి నుంచి అదరగొట్టి.. ఆఖరున అసలైన మ్యాచ్​లో బోల్తా కొట్టడం. ఈ బిరుదు సౌతాఫ్రికాకు ఉండేది. ఇప్పుడు దాని సరసన టీమ్​ఇండియా చేరుదంటూ కొందరు హేళన చేస్తుంటే.. మరి కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టీమ్​ఇండియా ఛోకర్స్ అంటూ ట్రోల్స్​..

నాటి నుంచి కలగానే..

టీమ్​ఇండియాపై డబ్ల్యూటీసీ టైటిల్​ గెలిచిన కివీస్​కు.. 2000 ఛాంపియన్స్​ ట్రోఫీ తర్వాత ఇదే తొలి ఐసీసీ టైటిల్​. అయితే.. విరాట్​ కోహ్లీ సారథ్యంలోని టీమ్​ఇండియాకు ఇంకా అది కలగానే ఉంది. 2013లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో గెలిచిన ఛాంపియన్స్​ ట్రోఫీనే చివరిది. అప్పటినుంచి రెండు(2015, 2019) వన్డే ప్రపంచకప్​లు, మరో రెండు(2014, 2016) టీ20 ప్రపంచకప్​లు, 2017 ఛాంపియన్స్​ ట్రోఫీలో ఓడిపోయింది టీమ్​ఇండియా.

టీమ్​ఇండియా.. ఛోకర్స్ అంటూ ట్వీట్లు

దీంతో సహజంగానే అభిమానుల్లో తీవ్రమైన అసంతృప్తి, కోపం నెలకొంది. అందుకే వారి అసహనాన్ని ట్విట్టర్​ వేదికగా వెల్లగక్కుతున్నారు. టీమ్​ఇండియాను 'ఛోకర్స్'​ అని పిలుస్తున్నారు.

ప్చ్​ కోహ్లీ..

ఐసీసీ ఈవెంట్​లో 2008లో అండర్​19 ట్రోఫీనే కెప్టెన్​గా కోహ్లీకి చివరిది. అది మినహా 2017లో ధోనీ నుంచి అన్ని ఫార్మట్లలో సారథ్య బాధ్యతలు అందుకున్న కోహ్లీకి చేదు జ్ఞాపకాలే మిగులుతున్నాయి. దీంతో క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్​గా అతడి సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైనా ఒక ఫార్మాట్​లో సారథ్య బాధ్యతలను కోహ్లీ వదులుకుంటాడనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక అక్టోబరులో భారత్​ ఆతిథ్యంలో జరిగే టీ20 ప్రపంచకప్​తోనైనా కోహ్లీ నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి.

ఇవీ చూడండి:

Team India: టీమ్​ఇండియా 'ఓటమి'కి ఫుల్​స్టాప్ ఎప్పుడు?

Cricket: ఏడు ఐసీసీ టోర్నీలు.. ప్రతిసారి కొత్త విజేతనే

ABOUT THE AUTHOR

...view details