సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ.. తుది పోరుకు సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ తమిళనాడుతో సోమవారం(నవంబరు 22) మరోసారి ఫైనల్లో (Syed Mushtaq Ali Final) తలపడనుంది కర్ణాటక. అయితే 2019 టైటిల్ పోరులో కర్ణాటక చేతిలో ఓడిపోయిన తమిళనాడు.. ఈ సారి ప్రతీకారం తీర్చుకొని కప్పు నిలబెట్టుకోవాలని చూస్తోంది.
2020-21 ఎడిషన్లో బరోడాపై గెలిచి.. రెండోసారి టైటిల్ కైవసం చేసుకుంది తమిళనాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు బరోడా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రెండేసి సార్లు (Syed Mushtaq Ali Winners) ఛాంపియన్లుగా నిలిచాయి. దీంతో ముచ్చటగా మూడోసారి కప్పును ముద్దాడడానికి కర్ణాటక, తమిళనాడు బరిలోకి దిగనున్నాయి.
కర్ణాటక కొట్టేనా?
కర్ణాటక ఛాంపియన్గా (Syed Mushtaq Ali Trophy) నిలిచేందుకు.. సెమీస్లో అదరగొట్టిన ఓపెనర్ రోహన్ మరోసారి బ్యాట్ ఝళిపించాల్సి ఉంటుంది. మిడిలార్డర్లో నిలకడలేమితో ఇబ్బంది పడుతున్న జట్టు (Karnataka Cricket Team).. ఫైనల్లో ఆ సమస్యను అధిగమించాలని ఆశిస్తోంది. ఇక టాప్ ఆర్డర్.. అభినవ్ మనోహర్, బీఆర్ భరత్ లాంటి ఆటగాళ్లతో పటిష్ఠంగానే కనబడుతుంది.
అయితే బౌలింగ్లో అనుభవలేమి కర్ణాటకను వేధిస్తోంది. కే గౌతమ్ ఇండియా-ఏ కి ఎంపికై వెళ్లడం ఆ జట్టుపై ప్రభావం చూపొచ్చు. కేసీ కరియప్ప, జే సుచిత్ రాణించాల్సిన అవసరం ఉంది.