దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉండరని తెలిసింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో వెన్నుముక గాయంతో ఇబ్బంది పడిన దీపక్ హోడా.. ఈ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. అలాగే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు ఈ సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు పేర్కొన్నారు.
కాగా, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు హోడా ఎంపికైనప్పటికీ.. వెన్ను నొప్పి కారణంగా కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే అతడు కొంతకాలంగా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఏడాది జరిగిన ఐపీఎల్‌లో అదరగొట్టిన హుడా భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన జట్టులో హుడా సభ్యుడిగా ఉన్నాడు.
సఫారీతో టీ20 సిరీస్‌కూ షమి దూరం
కరోనా నుంచి ఇంకా కోలుకోని టీమ్‌ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమి.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కూ దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టులో అతను స్టాండ్‌బైగా ఉన్న సంగతి తెలిసిందే. మ్యాచ్ ప్రాక్టీస్ కోసం షమిని ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్‌లకు ఎంపిక చేశారు. కానీ కరోనా సోకడంతో అతని స్థానంలో ఆసీస్‌పై ఉమేశ్‌ను ఆడించారు.
ఇప్పటికీ వైరస్ నుంచి షమి పూర్తిగా కోలుకోకపోవడంతో సఫారీ సేనతో టీ20లూ ఆడలేకపోతున్నాడు. ఈ సిరీస్‌కూ ఉమేశ్ జట్టులో కొనసాగనున్నాడు. మరోవైపు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న హార్దిక్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ జట్టులోకి రానున్నట్లు సమాచారం. వెన్ను నొప్పి కారణంగా దీపక్ హుడా కూడా దూరమవడంతో శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రానున్నాడు.