విరాట్ కోహ్లీ చేతుల మీదుగా.. టీమ్ఇండియా క్యాప్ అందుకోవడంతో తన కల నెరవేరిందని యువ బ్యాటర్ దీపక్ హుడా చెప్పాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన ఇతడు.. రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డే అనంతరం సూర్యకుమార్ యాదవ్‌తో మాట్లాడుతూ తన క్రికెట్ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు.
"వెస్టిండీస్‌పై తొలివన్డేతో అరంగేట్రం చేయడం చాలా అద్భుతమైన ఫీలింగ్. ఈ జట్టులో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ధోనీ లేదా కోహ్లీ చేతుల మీదుగా టీమ్ఇండియా క్యాప్ అందుకోవాలనేది నా చిన్నప్పటి కోరిక. తొలి వన్డే కోసం ఎంపికై, కోహ్లీ నుంచి క్యాప్ అందుకోవడం నాకు అద్భుతమైన అనుభూతి. మంచి విషయాలు జరగడానికి సమయం పడుతుంది. కోహ్లీ, రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్ లాంటి వాళ్లతో డ్రస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం మర్చిపోలేని అనుభూతి. ఆటపై దృష్టిపెట్టి బాగా కష్టపడతాను" అని దీపక్.. సూర్యకుమార్‌తో చెప్పాడు.