న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో(IND vs NZ T20 series) భాగంగా జైపుర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్(Deepak Chahar News) కంటి చూపుతోనే లక్ష రూపాయలు సొంతం చేసుకున్నాడు. ఓ ట్రోఫీ కూడా సాధించాడు.
గప్తిల్పై గుస్సా..
తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమ్‌ఇండియా. అయితే.. తొలి ఓవర్లోనే భువనేశ్వర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు న్యూజిలాండ్ బ్యాటర్ మిచెల్. అనంతరం మార్టిన్ గప్తిల్, మార్క్ ఛప్మన్ నిలకడగా రాణించారు. భారత్ ముందు 164 పరుగుల లక్ష్యాన్ని ఉంచడంలో కీలక పాత్ర పోషించారు.
తొలి ఇన్నింగ్స్‌లో భాగంగానే 18 ఓవర్లో దీపక్ చాహర్(Deepak Chahar Latest news) వేసిన తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు గప్తిల్. తర్వాత వేసిన బంతిని కూడా సిక్సర్ కొట్టే ప్రయత్నం చేసి శ్రేయస్ అయ్యర్ చేతికి చిక్కాడు. ఈ నేపథ్యంలో దీపక్ ఓ లుక్ ఇచ్చాడు. గప్తిల్‌ను అలా సీరియస్‌గా చూస్తూ.. ప్రతీకారం తీర్చుకున్నా అన్నట్లుగా కళ్లతోనే చెప్పే ప్రయత్నం చేశాడు.
మ్యాచ్ అనంతరం.. దీపక్ లుక్స్‌కు ప్రశంస లభించింది. 'మొమెంట్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు రూ. లక్ష నగదు అతడు గెలుచుకున్నాడు.
ఇదీ చదవండి:సిరాజ్‌ను కొట్టిన రోహిత్ శర్మ!.. వీడియో వైరల్
తొలి మ్యాచ్ భారత్‌దే..
జైపూర్ వేదికగా తొలి టీ20లో(IND vs NZ t20 series 2021) న్యూజిలాండ్‌పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం టీమ్‌ఇండియా నాలుగు వికెట్లను కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
సూర్యకుమార్ యాదవ్ (62), కెప్టెన్ రోహిత్ శర్మ (48) రాణించారు. తొలి వికెట్‌కు కేఎల్ రాహుల్ (15)తో కలిసి రోహిత్ అర్ధశతక భాగస్వామ్మం నిర్మించాడు. రాహుల్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి మరో అర్ధశతకం (59) జోడించారు.
రోహిత్ ఔటైనప్పటికీ సూర్యకుమార్ ధాటిగానే బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో టీ20 కెరీర్‌లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే దూకుడుగా ఆడుతున్న సూర్యకుమార్ కివీస్ బౌలర్ బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. రిషభ్ పంత్ 12*, శ్రేయస్ అయ్యర్ 5, వెంకటేశ్ అయ్యర్ 4 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, సౌథీ, డారిల్ మిచెల్, సాంట్నర్ తలో వికెట్ తీశారు.
ఇదీ చదవండి:
IND vs NZ: 'బౌల్ట్.. నా భార్యకు పుట్టిన రోజు కానుక ఇచ్చాడు'