Deepak Chahar IPL 2022: టీమిండియా పేసర్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన బౌలర్ దీపక్ చాహర్ మరో నాలుగు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న అతను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నెట్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. వెన్నునొప్పి ఎక్కువగా ఉన్నందున మరో నాలుగు నెలల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దురమయ్యాడు చాహర్. ఇప్పుడు ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్ 2022లోనూ అతడు ఆడటంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మధ్యలో ఈ లీగ్ జరగనుంది. నేషనల్ మీడియా కథనాల ప్రకారం.. తాజాగా తీసిన స్కాన్స్‌లో స్క్రాచెస్ ఉన్నాయని, మరో నాలుగు నెలల పాటు మైదానంలోకి అడుగుపెట్టకూడదని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం 2022 టీ20 వరల్డ్ కప్‌కు చాహర్ దూరమయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి.