Deepak Chahar: చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఐపీఎల్ ప్రారంభం కాకముందే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా ఐపీఎల్లో సగం మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో అతడి కుడిభుజానికి గాయమైంది.
"చాహర్ ఎనిమిది వారాల పాటు ఆటకు దూరంగా ఉండాలి. దీనివల్ల అతడు ఐపీఎల్ 2022 మొదటి దశకు అందుబాటులో ఉండడు."
-బీసీసీఐ అధికారిక వర్గాలు
మార్చి 26 నుంచి ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జాతీయ క్రికెట్ అకాడమీ ఇచ్చే తుది నివేదిక కోసం చెన్నై జట్టు ఎదురుచూస్తోంది. ఈసారి జరిగిన మెగావేలంలో చెన్నై జట్టు రూ.14 కోట్ల భారీ ధరకు చాహర్‌ను దక్కించుకుంది. ఈ వేలంలో రెండో అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడు చాహర్ కావడం విశేషం.
వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో గాయపడ్డ చాహర్ శ్రీలంకతో సిరీస్ నుంచి కూడా వైదొలిగాడు. ఆ సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో గెలిచింది.
అంతర్జాతీయ కెరీర్లో చాహర్ 20 టీ20 ఆడి 26 వికెట్లు పడగొట్టగా.. 7 వన్డేల్లో 10 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటిన చాహర్.. వన్డేల్లో రెండు అర్థశతకాలు సాధించాడు.
ఇదీ చదవండి:ఐపీఎల్లో 25% ప్రేక్షకులకు అనుమతి- మార్చి 8న ముంబయికి జట్లు