తెలంగాణ

telangana

ETV Bharat / sports

'దీపక్‌ చాహర్​ కోసం ఆ ఫ్రాంచైజీలు పోటీపడతాయి' - దీపక్​ చాహల్ ఐపీఎల్​​ మెగావేలం

Deepak chahar IPL: దీపక్‌ చాహర్‌పై ప్రశంసలు కురిపించాడు టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. మెగావేలంలో అతడిని కొనుగోలు చేయడానికి చెన్నై సూపర్ కింగ్స్‌తో సహా అన్ని ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయని పేర్కొన్నాడు.

deepak chahar
దీపక్‌ చాహర్​

By

Published : Feb 1, 2022, 12:16 PM IST

రాబోయే మెగా వేలంలో పేస్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ను కొనుగోలు చేయడానికి చెన్నై సూపర్ కింగ్స్‌తో సహా అన్ని ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. చాహర్‌ 2018లో తొలిసారి సీఎస్కేకు ఎంపికవ్వగా అప్పటి నుంచి ఆ జట్టులో కీలక బౌలర్‌గా రాణించాడు. నాలుగు సీజన్లలో మొత్తం 63 మ్యాచ్‌లు ఆడిన ఈ పేస్‌ బౌలర్‌.. 58 వికెట్లు పడగొట్టి కెప్టెన్‌ ధోనీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయినా, ఈసారి చెన్నై టీమ్‌ అతడిని అట్టిపెట్టుకోలేదు. చెన్నై జట్టులో ధోనీ, జడేజా, రుతురాజ్‌తో పాటు మొయిన్‌ అలీని తమ వద్దే ఉంచుకుంది. దీంతో చాహర్‌ వేలంలో పాల్గొనక తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే చోప్రా మాట్లాడుతూ చాహర్‌ను తీసుకొనేందుకు అన్ని ఫ్రాంఛైజీలు పోటీపడతాయని అంచనా వేశాడు.

"దీపక్‌ చాహర్‌ కొత్త బంతితో రెగ్యులర్‌గా వికెట్లు పడగొడతాడు. అతడిలా మరే భారత బౌలర్‌ కూడా అంత నిలకడగా వికెట్లు తీయలేడు. తొలి మూడు ఓవర్లలో అతడే కీలక బౌలర్‌గా నిలుస్తాడు. పవర్‌ప్లేలో బౌలింగ్‌ చేసి పలు వికెట్లు తీస్తాడు. ప్రత్యర్థుల వెన్నువిరుస్తాడు. అయితే, అతడు డెత్‌ ఓవర్లలో అత్యంత స్పెషలిస్టు అని చెప్పలేం కానీ.. అందుకు తగ్గట్లు ప్రయత్నిస్తాడు. దీంతో ఈసారి వేలంలో చెన్నై కూడా అతడిని తీసుకొనేందుకు ఆసక్తి చూపుతుంది. అలాగే అన్ని జట్లూ చాహర్‌పై కన్నేస్తాయి. ఇటీవల అతడు బ్యాటింగ్‌లోనూ పరుగులు చేస్తున్నాడు. దీంతో కచ్చితంగా మంచి ధర పలికే అవకాశమే ఉంది" అని చోప్రా పేర్కొన్నాడు.

కాగా, ఇటీవల చాహర్‌ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో అర్ధ శతకం సాధించగా గతేడాది శ్రీలంక పర్యటనలోనూ ఒక హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో అతడు బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయగల ఆటగాడిగా మేటిగా రాణిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details