Deepak Chahar IPL 2022: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఐపీఎల్ వేలంలో కోట్లు కుమ్మరించి సొంతం చేసుకున్న ఫాస్ట్‌బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నిలకడగా రాణిస్తున్న చాహర్.. సీజన్ మొత్తం అందుబాటులో ఉండకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే జట్టు ప్రణాళికలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
మరోవైపు వచ్చేనెల చివరి వారం నుంచి మే వరకు భారత్‌లో ఐపీఎల్ జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. ఈ మేరకు త్వరలోనే మ్యాచ్‌లు వేదికలు మరికొన్ని రోజుల్లో ప్రకటించనుంది. ఈ తరుణంలో ఐపీఎల్ సీజన్ కోసం మార్చి రెండో వారం నుంచి సీఎస్కే సన్నాహాలను ప్రారంభించాలని యోచిస్తోంది. దీంతో జట్టు కూర్పు ప్రణాళికల్లో మార్పులు జరగొచ్చు. అయితే చాహర్ గాయం నుంచి త్వరగా కోలుకుని ఈ సీజన్ మొత్తం అందుబాటులో ఉంటాడని చెన్నై సూపర్‌కింగ్స్ ఆశాభావం వ్యక్తం చేసింది.