తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20 వరల్డ్​కప్​లో డివిలియర్స్​ రీ-ఎంట్రీ! - ab de villiers come back

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్​ ఏబీ డివిలియర్స్​.. తాను ప్రోటీస్ జట్టుకు తిరిగి ఆడే విషయంపై స్పందించాడు. సౌతాఫ్రికా టీమ్​కు పునరాగమనం చేస్తే అంతకంటే ఆనందం ఏముందని వెల్లడించాడు. ఐపీఎల్​ అనంతరం కోచ్​ బౌచర్​తో మాట్లాడతానని తెలిపాడు.

a b divilliers, marj boucher
ఏబీ డివిలియర్స్​, మార్క్ బౌచర్

By

Published : Apr 19, 2021, 10:00 AM IST

దక్షిణాఫ్రికా జట్టుకు తిరిగి ఆడటానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు ఏబీ డివిలియర్స్​. ఈ ఏడాది భారత్ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్​లో పునరాగమనం చేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఐపీఎల్​ అనంతరం ప్రోటీస్​ కోచ్​ బౌచర్​తో మాట్లాడతానని వెల్లడించాడు.

ఇదీ చదవండి:దిగ్గజ స్పిన్నర్​ ముత్తయ్య మురళీధరన్​కు స్టెంట్

"తిరిగి సౌతాఫ్రికాకు ఆడితే అంతకంటే ఆనందం ఏముంటుంది. పునరాగమనం చేసే విషయంలో గతేడాదే నన్ను సంప్రదించారు. ఫామ్​, ఫిట్​నెస్​ దృష్టిలో ఉంచుకుని ఆసక్తి ఉందని చెప్పా. ఐపీఎల్​ ముగిసిన తర్వాత కోచ్​ బౌచర్​తో మళ్లీ మాట్లాడతా."

-ఏబీ డివిలియర్స్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్.

పొట్టి ఫార్మాట్​లో 2017 అక్టోబర్​లో చివరిసారిగా దక్షిణాఫ్రికా తరఫున ఆడాడు ఏబీ. 2018 ఫిబ్రవరిలో వన్డేల్లో చివరిసారిగా ప్రోటీస్​ టీమ్​కు ప్రాతినిధ్యం వహించాడు డివిలియర్స్​.

ఇదీ చదవండి:బుమ్రా.. డెత్‌ ఓవర్స్‌ రక్షకుడు!

ABOUT THE AUTHOR

...view details