తెలంగాణ

telangana

By

Published : May 16, 2021, 9:31 AM IST

Updated : May 16, 2021, 10:46 AM IST

ETV Bharat / sports

టీకా పంపిణీ కేంద్రంగా అరుణ్​ జైట్లీ స్టేడియం!

అరుణ్​ జైట్లీ స్టేడియం ప్రాంగణాన్ని టీకా పంపిణీ కేంద్రంగా వాడుకోవాలని దిల్లీ క్రికెట్ అసోసియేషన్​.. కేజ్రీవాల్ ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఓ లేఖను రాసింది. ఈ విషయాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్​ జైట్లీ ధ్రువీకరించారు.

Arun Jaitley Stadium,  as Covid vaccination centre
అరుణ్​ జైట్లీ స్టేడియం, దిల్లీ క్రికెట్ అసోసియేషన్

దిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్​ మైదానాన్ని వ్యాక్సినేషన్ కేంద్రంగా ఉపయోగించుకోవాలని.. కేజ్రీవాల్​ ప్రభుత్వానికి లేఖ రాసింది దిల్లీ అండ్ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్​(డీడీసీఏ). ఈ విషయాన్ని రాష్ట్ర క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రోహన్​ జైట్లీ ధ్రువీకరించారు.

ఐపీఎల్​లో భాగంగా మే 2 వరకు మ్యాచ్​లకు ఆతిథ్యమిచ్చింది అరుణ్​ జైట్లీ స్టేడియం. కరోనా కారణంగా లీగ్​ నిరవధిక వాయిదా పడింది. దీంతో మైదానాన్ని టీకా కేంద్రంగా వాడుకోవాలని సూచించింది డీడీసీఏ. దీని ద్వారా రోజుకు దాదాపు 10వేల మందికి టీకా పంపిణీ చేపట్టవచ్చని పేర్కొంది.

"ఒకవేళ టీకా కేంద్రం కోసం దిల్లీ ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లైతే అరుణ్​ జైట్లీ స్టేడియాన్ని నిస్సందేహంగా వాడుకోవచ్చు. పరిస్థితులు కుదుటపడే వరకు, మైదానంలో క్రికెట్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యేంత వరకు క్రీడా ప్రాంగణాన్ని ఉపయోగించుకోవచ్చు. రోజుకు దాదాపు పది వేల మందికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది."

- రోహన్ జైట్లీ, దిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు.

దిల్లీలో 45 ఏళ్లు పైబడిన వారికి 470 కేంద్రాల్లో టీకా పంపిణీ చేపడుతుండగా.. 18-44 ఏళ్ల వారికి 394 సెంటర్లలో వ్యాక్సినేషన్​ చేస్తున్నారు. అన్ని వయసుల వారికి కలిపి ఇప్పటివరకు 41.64 లక్షల కరోనా టీకాలు ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. దిల్లీలో పాజిటివిటీ రేటు​ 11 శాతంగా ఉన్నట్లు సీఎం కేజ్రీవాల్​ వెల్లడించారు. శనివారం కొత్తగా 6,500 కేసులు వచ్చినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:ఇటాలియన్​ ఓపెన్: ఫైనల్లోకి జకో.. రఫాతో అమీతుమీ

Last Updated : May 16, 2021, 10:46 AM IST

ABOUT THE AUTHOR

...view details