తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ కుమార్తెకు రేప్​ వార్నింగ్..​ కేసుపై సుమోటో విచారణ - మహ్మద్ షమీ

టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీ, అనుష్క శర్మ దంపతుల కూతురు వామికకు(తొమ్మిది నెలలు)వచ్చిన అత్యాచారా బెదరింపులపై నమోదైన కేసును సుమోటోగా తీసుకుంది దిల్లీ మహిళా కమీషన్​. ఆ నిందితులకు సంబంధించిన ఎఫ్​ఐఆర్​ను నవంబరు 8వ తేదీలోగా సమర్పించాలని పోలీసులను కోరింది.

kohli
కోహ్లీ

By

Published : Nov 2, 2021, 2:00 PM IST

టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క, కూతు​రు వామికలపై(Virat Kohli Daughter Threats) కొందరు నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేశారు. టీ20 ప్రపంచకప్​లో జట్టు వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెటర్లపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ కూతురు ఫొటో విడుదల చేయాలని.. ఆమెపై అత్యాచారానికి పాల్పడతామంటూ పలువురు హేయమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ కేసును సుమోటోగా తీసుకుంది దిల్లీ మహిళా కమీషన్. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్​ను నవంబరు 8లోగా సమర్పించాలని పోలీసులను కోరింది.

ఏం జరిగింది?

టీ20 ప్రపంచకప్​లో పాకిస్థాన్​, న్యూజిలాండ్(ind vs pak)​ చేతిలో ఓటమిని సహించలేని కొందరు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో టీమ్​ఇండియా క్రికెటర్లపై దారుణ ట్రోలింగ్​కు (Team India Trolled) పాల్పడుతున్నారు. ప్రధానంగా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ (Virat Kohli News), పేసర్ మహ్మద్​ షమీని (Mohammed Shami Trolls) అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. మత విద్వేషాన్ని ఎదుర్కొంటున్న షమీకి కోహ్లీ అండగా నిలవడమే అందుకు కారణం.

అంతటితో ఆగకుండా కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ సహా వారి కూతురు వామికను (Virat Kohli Daughter Threats) కూడా ఇందులోకి లాగుతున్నారు. చిన్నారి ఫొటోను విడుదల చేయాలని, ఆమెపై అత్యాచారానికి పాల్పడతామంటూ హేయమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

భారత జట్టు పేలవ ప్రదర్శనకు గతంలో ఏ సంబంధం లేకుండా అనుష్కను ట్రోల్​ చేసేవారు. ఇప్పుడు మానవత్వాన్ని మంటగలిపేలా, అన్ని హద్దులూ దాటుతూ అభం శుభం తెలియని చిన్నారిపై అసభ్య వ్యాఖ్యలు చేయడం వారిలోని పశుతత్వాన్ని చాటుతోందంటూ పలువురు పలువురు సోషల్ మీడియా యూజర్లు మండిపడుతున్నారు. ఇలాంటి బెదిరింపులను అరికట్టేలా కఠిన చట్టాలు తెచ్చి, అలాంటి దుష్టులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

గతేడాది ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ చేతిలో చెన్నైసూపర్​ కింగ్స్​ ఓటమి పాలైన సందర్భంలో ఎంఎస్​ ధోనీ కూతురు జీవాకు ఇలాంటి బెదిరింపులే ఎదురయ్యాయి.

ఇదీ చూడండి: Kohli Daughter: కోహ్లీ కుమార్తెకు అత్యాచార బెదిరింపులు!

ABOUT THE AUTHOR

...view details