తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రౌడీ బేబీ' పాటతో.. వార్నర్ ఈజ్ బ్యాక్ - రౌడీ బేబీ సాంగ్

ఏ మాత్రం తీరిక సమయం దొరికినా నెట్టింట సందడి చేసే ఆసీస్ స్టార్ బ్యాట్స్​మన్​ డేవిడ్ వార్నర్.. మరో కొత్త వీడియోను పోస్టు చేశాడు. 'మారి-2' సినిమాలోని 'రౌడీ బేబీ' పాటకు చిందులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

David Warner, australia cricketer
డేవిడ్ వార్నర్, ఆసీస్ క్రికెటర్

By

Published : May 19, 2021, 8:41 PM IST

సామాజిక మాధ్యమాల్లో ఎల్లప్పుడూ అభిమానులను అలరించే ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్​.. మరోసారి ఓ కొత్త వీడియోను పోస్టు చేశాడు. ప్రముఖ తమిళ హీరో ధనుష్ నటించిన 'మారి-2' సినిమాలోని 'రౌడీ బేబీ' పాటతో అలరించాడు. "డిమాండ్​ వల్ల ఈ పాట చేశా. పేరు చెప్పుకోండి," అంటూ తన ఇన్​స్టా ఖాతాలో రాసుకొచ్చాడు.

దాదాపు నెలన్నర తర్వాత నెట్టింట ఈ తరహా పోస్టు పెట్టాడు వార్నర్. దీంతో అతడి అభిమానులు సరదాగా స్పందించారు. 'మళ్లీ మీరు తిరిగి రావడం బాగుందంటూ' అతడి ఫ్యాన్స్ కామెంట్ పెట్టారు. 'వార్నర్ భాయ్ ఈజ్ బ్యాక్' అంటూ మరో అభిమాని రిప్లై ఇచ్చాడు.

పలు ప్రముఖ తెలుగు పాటలకి టిక్​టాక్ వీడియోలు చేస్తూ గతేడాది లాక్​డౌన్​ను ఉల్లాసంగా గడిపాడు వార్నర్. వాటితో పాటు డైలాగులు చెప్పడం, పాటలు పాడడం వంటి అలరించే పనులతో భారతీయ అభిమానులకు ఎంతో చేరువయ్యాడు ఈ ఆసీస్ క్రికెటర్.

ఇదీ చదవండి:'అందుకే డివిలియర్స్​ జట్టులోకి రావట్లేదు'

ABOUT THE AUTHOR

...view details