Warner supports Kohli: టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ లాంటి అత్యుత్తమ బ్యాటర్ విఫలమైనా పర్వాలేదని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. కోహ్లీ రెండేళ్లుగా సరిగ్గా బ్యాటింగ్ చేయలేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో 'బ్యాక్ స్టేజ్ విత్ బోరియా' అనే ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన వార్నర్ ఇలా చెప్పుకొచ్చాడు.
"కోహ్లీ లాంటి ఆటగాడు విఫలమైనా పర్వాలేదు. ఎన్నో ఏళ్ల నుంచి అత్యుత్తమ ఆట ఆడుతున్న ఆటగాడు ఇప్పుడు విఫలమవ్వడం అర్థం చేసుకోదగిన విషయమే. అందుకు అతడు పూర్తి అర్హత కలిగినవాడు. స్టీవ్ స్మిత్ కూడా గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సెంచరీ చేయలేదు. కానీ, అతడు ప్రతి నాలుగు ఇన్నింగ్స్‌లకు ఒక శతకం బాదుతాడని గణాంకాలు చెబుతున్నాయి. కొన్నిసార్లు కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని అర్థం చేసుకోవచ్చు. అందుకే వారిపై అధిక ఒత్తిడి ఉంటుందని అనుకుంటున్నా."