David Warner SRH: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ గతేడాది ఐపీఎల్లో చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. కారణం కూడా చెప్పకుండా వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ సన్‌రైజర్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ అంశంపై మరోసారి మాట్లాడాడు వార్నర్. 'బ్యాక్‌స్టేజ్ విత్ బోరియా' కార్యక్రమంలో భాగంగా సన్‌రైజర్స్ యాజమాన్యం తీరుపై అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని అన్నాడు.
"కెప్టెన్సీ నుంచి తప్పించి కనీసం జట్టులో కూడా అవకాశం కల్పించకుండా చేసి.. యాజమాన్యం జట్టులోని ఇతర ఆటగాళ్లకు ఇచ్చిన సందేశం ఏంటి? యువ ఆటగాళ్లకు దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?. అన్నిటికన్నా బాధించే విషయం ఏమిటంటే.. ప్రస్తుతం జట్టులో ఉన్నవారు కూడా 'మా పరిస్థితీ ఇలానే అవుతుందేమో?' అని ఆలోచిస్తారు."
-- డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా క్రికెటర్.
తన ఫామ్‌పై, కెప్టెన్సీపై మేనేజ్మెంట్తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ వారు అవకాశం ఇవ్వలేదని వార్నర్ తెలిపాడు. అయితే.. వార్నర్ స్థానంలో ఎస్ఆర్హెచ్ను నడిపించాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్. వచ్చే సీజన్లోనూ కేన్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా, సన్‌రైజర్స్ జట్టు ఈ సీజన్ కోసం కెప్టెన్ విలియమ్సన్‌ను, యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్, ఆల్‌రౌండర్ అబ్దుల్ సమద్‌ను రిటైన్ చేసుకుంది.