తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి' - మిచెల్​ జాన్సన్ వ్యాఖ్యలపై స్పందించిన డేవిడ్​ వార్నర్

David Warner Retirement : రిటైర్మెంట్​ విషయంలో మిచెల్​ జాన్సన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా స్టార్​ క్రికెటర్​ డేవిడ్ వార్నర్ తాజాగా స్పందించాడు. మిచెల్​ మాట్లాడిన విషయాన్ని తాను తప్పుబట్టనని ఎవరి అభిప్రాయాలు వారికుంటాయని వార్నర్​ అన్నాడు.

David Warner Retirement
David Warner Retirement

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 2:23 PM IST

Updated : Dec 8, 2023, 3:27 PM IST

David Warner Retirement :రిటైర్మెంట్​ విషయంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మిచెల్​ జాన్సన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దిగ్గజ క్రికెటర్​ డేవిడ్ వార్నర్ తాజాగా స్పందించాడు. ఓ ప్రముఖ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై మాట్లాడాడు. మిచెల్​ మాట్లాడిన విషయాన్ని తాను తప్పుబట్టనన్న వార్నర్ ఎవరి అభిప్రాయాలు వారికుంటాయని చెప్పాడు. వాటిని వ్యక్తపరిచే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అతడు అన్నాడు.

అసలేం జరిగిందంటే..ఆసీస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్, పాకిస్థాన్ టెస్టు సిరీస్ అనంతరం రెడ్​బాల్ క్రికెట్​కు గుడ్​బై చెప్పనున్నాడు. ఈ క్రమంలో, బాల్ టాంపరింగ్​ వివాదంలో ఏడాది నిషేదం ఎదుర్కొన్న వార్నర్ గ్రాండ్ సెండాఫ్​కు అనర్హుడని జాన్సన్ అన్నాడు. దీనిపై తాజాగా స్పందించిన వార్నర్, ఈ వ్యాఖ్యలు చేశాడు.

వార్నర్​కు కమిన్స్​ మద్దతు..ఈ వివాదం నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్​ ప్యాట్ కమిన్స్, వార్నర్​కు మద్దతుగా నిలిచాడు. అతడు వార్నర్, స్మిత్​తో కలిసి చాలా కాలంపాటు క్రికెట్ అడానని అన్నాడు. "మేము ఒకరినొకరికి మద్దతుగా నిలుస్తాం. నేను వార్నర్, స్మిత్​తో కలిసి అనేక సంవత్సరాలు క్రికెట్ ఆడాను. ఇలాంటి పరిస్థితుల్లో మనకు వస్తున్న మద్దతును అప్పుడప్పడు గుర్తుంచుకోవాలి. నన్ను నా తల్లిదండ్రులు గొప్పగా పెంచారు. అది నాకు ప్రతిరోజూ కష్టపడి పనిచేయడం నేర్పింది. అలా కష్టపడి చేయాలన్న ఆలోచనను నా తల్లిదండ్రులు నాలో నాటారు. మీరు ప్రపంచ వేదికపైకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలియదు. మీ చట్టూ మీడియా ఉంటుంది. చాలా విమర్శలు వస్తాయి. దాంతోపాటు చాలా సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. క్రికెట్​కు మద్దతు ఇవ్వడానికి ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ క్రికెట్. ఇది అద్భుతమైనది పరిణామం" అని కమిన్స్ అన్నాడు.
Pakistan Tour Of Australia :పాకిస్థాన్, ఆస్ట్రేలియా గడ్డపై మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ ఆడనుంది. ఈ సిరీస్​లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (సిడ్ని)తో జరిగే ఆఖరి మ్యాచ్​తో వార్నర్ టెస్టు కెరీర్​కు వీడ్కోలు పలకనున్నాడు.

Warner Alluarjun : వార్నర్​కు అల్లు అర్జున్​ స్పెషల్ మెసేజ్​.. ఇప్పుడిదే ట్రెండింగ్​!

కమిన్స్​ సేన షాకింగ్​ నిర్ణయం.. 11 ఏళ్లలో తొలిసారి!

Last Updated : Dec 8, 2023, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details