విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానులకు ఆనందాన్ని పంచే ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. కాస్తా ఖాళీ సమయం దొరికినా సామాజిక మాధ్యమాల్లో అలరిస్తుంటాడు. భారతీయ సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ ఫ్యాన్స్‌కు వినోదాన్ని పంచుతుంటాడు.
తాజాగా మరో ఫేమస్ తెలుగు పాటను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు వార్నర్. తనకు అత్యంత ఇష్టమైన పాట అంటూ ఆ వీడియో కింద రాసుకొచ్చాడు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నటించిన 'రాములో రాములా' పాటకు చిందులేశాడు. ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్‌గా మారింది.