తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ball tampering: వార్నర్​ను అలా చేయమని చెప్పింది​ క్రికెట్​ ఆస్ట్రేలియానా? - మరోసారి వార్నర్ బాల్ ట్యాంపరింగ్

డేవిడ్ వార్నర్-స్టీవ్‌ స్మిత్ బాల్ టాంపరింగ్‌ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఆ వివరాలు..

warner ball tampering
వార్నర్ బాల్​ ట్యాంపరింగ్​

By

Published : Dec 10, 2022, 11:13 AM IST

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్ డేవిడ్ వార్నర్-స్టీవ్‌ స్మిత్ బాల్ టాంపరింగ్‌ వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది. సాండ్‌పేపర్‌ గేట్‌గా పిలిచే స్కాంలో వారిద్దరూ నిషేధం ఎదుర్కొని మరీ వచ్చిన సంగతి తెలిసిందే. 2018లో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడ్డారని స్మిత్, వార్నర్‌పై వేటు పడింది. తాజాగా డేవిడ్‌ వార్నర్‌ మేనేజర్‌ జేమ్స్ ఎర్స్కిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాల్‌ టాంపరింగ్‌ చేసేందుకు ఆటగాళ్లను క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రతినిధులు అనుమతి ఇచ్చారని ఆరోపించాడు.

"2018లో బాల్‌ టాంపరింగ్‌ సంఘటన జరగకముందే ఇలా చేయడానికి క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రతినిధులు అనుమతి ఇచ్చారు. 2016లో హోబర్ట్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆసీస్‌ టెస్టు మ్యాచ్‌ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ ఓడింది. దీంతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న ఇద్దరు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఆటగాళ్లను చీవాట్లు పెట్టారు. 'అప్పుడు బంతిని రివర్స్‌ స్వింగ్ చేయడమే ఏకైక మార్గం ఉంది. అందుకోసం టాంపరింగ్‌ చేయాలి' అని వార్నర్‌ అనడంతో 'అదే చేసేయండి' అంటూ ఆ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. అయితే వారికి సీఏ అనుమతి ఉందో లేదో నేను చెప్పలేను. కానీ వార్నర్ మాత్రం క్రికెట్‌ ఆస్ట్రేలియాను కాపాడాడు. అలాగే మిగతా క్రికెటర్లను కూడా రక్షించాడు. ఏదైనా జరిగితే ఎవరూ కూడా కారణాలను వినడానికి ఆసక్తి చూపరని తెలుసు. చివరికి ఇప్పుడు వార్నర్‌ను పెద్ద విలన్‌గా చిత్రీకరించారు" అని ఆరోపించాడు. అయితే ఎర్స్కిన్‌ వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించలేదు.

ఇదీ చూడండి:Fifa worldcup: బ్రెజిల్​, నెదర్లాండ్స్​​కు షాక్​.. సెమీస్​​కు దూసుకెళ్లిన క్రొయేషియా-అర్జెంటీనా

ABOUT THE AUTHOR

...view details