తెలంగాణ

telangana

ETV Bharat / sports

నేను రెడీగానే ఉన్నా.. కానీ టీమ్​ మేనేజ్​మెంట్​ అలా చేస్తే..: రిటైర్మెంట్​పై వార్నర్ - వార్నర్​ 100వ టెస్టు 10వ ఆటగాడు

వచ్చే ఏడాది భారత్​లో జరిగే ప్రపంచకప్ ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నాడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్​ వార్నర్​. కానీ టీమ్​ మేనేజ్​మెంట్​ అలా చేస్తే మాత్రం జట్టు నుంచి తప్పుకోవాల్సి వస్తుందని పేర్కొన్నాడు.

David Warner On Worldcup
David Warner

By

Published : Dec 29, 2022, 2:59 PM IST

Updated : Dec 29, 2022, 3:23 PM IST

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్​లో డబుల్​ సెంచరీ బాది ఫుల్​ జోష్​ మీదున్న ఆస్ట్రేలియా స్టార్​ డేవిడ్​ వార్నర్​.. రిటైర్మెంట్​ గురించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది భారత్​లో జరగబోయే వన్డే ప్రపంచకప్​కు తనను పక్కనపెడితే జట్టుకు దూరంగా ఉంటానంటూ పరోక్షంగా రిటైర్మెంట్​ గురించి మాట్లాడాడు. కాగా, అంతకుముందు రీసెంట్​గా తాను ఆటకు వీడ్కోలు పలకాల్సి వస్తే మొదటగా టెస్టు క్రికెట్​కే గుడ్​బై చెబుతానని అన్నాడు.

ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికాతో ఆడిన రెండో టెస్టు తర్వాత ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు... 'ఇదే మీ చివరి బాక్సింగ్​ టెస్టా? అని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం చెప్పాడు. "నేను వచ్చే ఏడాది వన్డే వరల్డ్​కప్​ ఆడాలనుకుంటున్నాను. అందుకోసం ఫిట్​గా ఉంటూ మంచి పరుగులు చేయడానికి ప్రయత్నిస్తుంటాను. కానీ టీమ్​ మేనేజ్​మెంట్​ నన్ను పక్కనపెడితే మాత్రం జట్టు నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉంటా" అని పేర్కొన్నాడు.

ఇకపోతే దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్​ వార్నర్​కు వందో టెస్ట్ మ్యాచ్​. అలా తన వందో మ్యాచ్​లో సెంచరీ బాది.. టెస్ట్​ క్రికెట్​ చరిత్రలో తమ వందో టెస్టులో శతకం బాదిన పదో క్రికెటర్​గా రికార్డుకెక్కాడు. దీని గురించి మాట్లాడుతూ.. "నా కోసం పరుగులు ఎదురుచూస్తున్నాయి. పెద్ద వేదికలపై అద్భుత ప్రదర్శన చేయగలిగే శక్తి నాలో ఉందని తెలుసు. నా వందో టెస్ట్ ఎమ్​సీజీ లాంటి గొప్ప వేదికలో జరగడం గొప్పగా భావిస్తున్నాను. ఇకపోతే ఈ మ్యాచ్​ విజయంలో ఆటగాళ్లంతా మంచి ప్రదర్శన చేశారు. కెమరూన్​ గ్రీన్​, మిచెల్​ స్టార్క్​, అలెక్స్​ క్యారీ సెంచరీ ఇలా అందరూ గొప్పగా ఆడారు.​" అని పేర్కొన్నాడు.

Last Updated : Dec 29, 2022, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details