తెలంగాణ

telangana

ETV Bharat / sports

Warner: సెంచరీ బాది ఆ బుడ్డోడికి స్పెషల్​ గిఫ్ట్.. ప్రశంసలతో ముంచెత్తిన ఫ్యాన్స్

ఇంగ్లాండ్​తో జరిగిన మూడో వన్డేలో సెంచరీతో చెలరేగిన డేవిడ్​ వార్నర్​.. ఓ బుడ్డోడికి స్పెషల్​ గిఫ్ట్ ఇచ్చాడు. అది తీసుకున్న ఆ చిన్నోడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ వీడియోను మీరు చూసేయండి..

David Warner gives his pair of gloves to a child
వార్నర్​ సూపర్​ ఇన్నింగ్స్​.. ఆ బుడ్డోడికి స్పెషల్​ సర్​ప్రైజ్​

By

Published : Nov 22, 2022, 5:21 PM IST

ఆస్ట్రేలియా.. ఈ పేరు చెప్పగానే క్రికెట్ అభిమానులకు టక్కున గుర్తుకు వచ్చే పేరు స్లెడ్జింగ్. కానీ గత కొంత కాలంగా ఆ జట్టు తీరులో మార్పు వస్తోంది. ముఖ్యంగా ఎంతో దూకుడుగా ఉండే ఆ జట్టు స్టార్​ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలా పరిణతి చెందాడు. సోషల్​మీడియాలోనూ రీల్స్​ చేస్తూ అభిమానులకు మరింత చేరువయ్యాడు. అయితే ఇతడు తాజాగా తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరిగిన మూడో వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్న వార్నర్.. ఔట్​ అయ్యాక వెళ్తూ వెళ్తూ ఓ బుడతడికి గిఫ్ట్​ ఇచ్చి సర్​ప్రైజ్​ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​ అవుతోంది.

కాగా, సొంత గడ్డపై జరిగిన టీ20 ప్రపంచ కప్​లో దారుణంగా విఫలమైన వార్నర్​.. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే తాజాగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న సిరీస్​తో ఆ విమర్శలకు తన బ్యాట్​తో సమాధానమిస్తున్నాడు. తొలి వన్డేలో 86 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్​ భాయ్​.. రెండో వన్డేలో మళ్లీ డౌన్​ అయ్యాడు. కానీ మూడో మ్యాచ్​లో మాత్రం సెంచరీ చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు. అయితే ఈ మ్యాచ్​లోనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వార్నర్ ఔట్​ అయ్యాక డ్రెస్సింగ్ రూమ్​కు వెళ్తున్న క్రమంలో.. పెవిలియన్ దగ్గర కొందరు చిన్నారులు వార్నర్​కు చేతులు అందించడానికి చేతులు చాచారు.

ఈ క్రమంలోనే వారి దగ్గరగా వచ్చిన వార్నర్ ఓ బుడతడికి తన చేతి గ్లౌజ్​లను గిఫ్ట్​గా ఇచ్చాడు. ఇక ఆ గ్లౌజ్​లను అందుకున్న ఆ బుడతడు స్పీడ్​గా వాళ్ల అమ్మ దగ్గరకు పరిగెత్తుకెళ్లాడు. వాటిని వాళ్ళ అమ్మకు అందించి తెగ సంబరపడిపోయాడు. ఆ పిల్లాడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ బుడ్డోడి అమ్మ, సొదరుడు సైతం గ్లౌజ్​లను పట్టుకుని తెగ మురిసిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. కాగా, ఈ మ్యాచ్​ వర్షం కారణంగా ఆగిపోయింది. డీఎల్ఎస్ విధానం ప్రకారం ఫలితాన్ని ప్రకటించగా.. ఆసీస్​ 221 పరుగుల తేడాతో గెలిచింది.

ఇదీ చూడండి:మూడో టీ20 మ్యాచ్‌ టై.. భారత్‌దే సిరీస్‌

ABOUT THE AUTHOR

...view details