టీ20 ప్రపంచకప్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner SRH) 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచాడు. అయితే.. ఈ మెగా టోర్నీకి ముందు జరిగిన ఐపీఎల్ సీజన్లో వార్నర్‌కు చేదు జ్ఞాపకాలే మిగిలాయి. పేలవ ప్రదర్శన కారణంగా సన్‌రైజర్స్ జట్టు అతడిని కెప్టెన్‌గా(David Warner reply to fan) తొలగించింది. కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే ఆడేందుకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో కనీసం కారణం కూడా చెప్పకుండా సన్‌రైజర్స్ అతడిని సారథిగా తొలగించిందని వార్నర్ ఓ సందర్భంలో చెప్పాడు.
వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం మెగా వేలం ప్రక్రియ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు వార్నర్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ఇన్‌స్టా వేదికగా ఓ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ పేజ్ పోస్ట్‌కు వార్నర్ స్పందించడం విశేషం.
'వచ్చే సీజన్ ఐపీఎల్(IPL 2022) దృష్ట్యా సన్‌రైజర్స్ జట్టు ఎవరికి బాధ్యతలు అప్పగించాలి?, ఎవరిపై దృష్టిసారించాలి' అని ఓ ఫ్యాన్ పేజ్ పోస్ట్ చేసింది. దీనిపై అభిమానుల స్పందన కోరింది. దీనిపై కామెంట్ చేసిన ఓ అభిమాని.. 'టామ్ మూడీ హెడ్ కోచ్, డేవిడ్ వార్నర్ కెప్టెన్'గా ఉండాలని అన్నాడు. దీనికి 'నో థాంక్స్' అని రిప్లై ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు వార్నర్.
భారత్‌లోనే..